|
| సూర్య సన్నాఫ్ కృష్ణన్ విజయానందం |
| శనివారం, 29 నవంబర్ 2008 ( 17:33 IST ) | |
"గజిని" తరువాత సూర్య ద్విపాత్రాభినయంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" అసాధారణ ఓపెనింగ్స్‌తో అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోందని చిత్రవర్గాలు తెలిపాయి. ఆస్కార్ ఫిలింస్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వి.రవిచంద్రన్ నిర్మించిన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో 550 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రాన్ని తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తోపాటు, యూత్‌ని ఆకట్టుకునే చక్కని లవ్‌స్టోరీలతో తెరకెక్కించారు. ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, దశరథ్‌లు ఈ సినిమా చూసిన అనంతరం తమకు కలిగిన అనుభూతిని తెలియజేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్.వి.ఆర్. మీడియా విడుదల చేసింది.
ఎస్‌విఆర్ మీడియ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఆస్కార్ ఫిలింస్ బేనర్‌లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయన్నారు. సూర్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన "కాక కాక" ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అదే కాంబినేషన్‌లో వచ్చిన "సూర్య సన్నాఫ్ కృష్ణన్" కూడా అందరూ తప్పక చూడాల్సిన సినిమాల కోవలోకి చేరుతుందన్నారు.
కథపరంగానూ, సాంకేతికంగానూ సినిమాలో ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా ఉందని, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ చాలా చక్కగా పండిందన్నారు. 16 సంవత్సరాల యువకుడు నుంచి 60 సంవత్సరాల వృద్ధుడి వరకు సూర్య వివిధ రూపాల్లో కనిపించడం అద్భుతమన్నారు. ఎంతో కష్టపడి సూర్య ఆ క్యారెక్టర్లు చేశారు కాబట్టే సినిమా ఘనవిజయం సాధించిందని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
దశరథ్ మాట్లాడుతూ... డిఫరెంట్ సినిమా చూడాలనుకునే ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన మంచి సినిమా "సూర్య సన్నాఫ్ కృష్ణన్" అని, ప్రశంసించారు. "ఘర్షణ", "రాఘవన్" వంటి విభిన్న చిత్రాలు రూపొందించిన గౌతమ్ మీనన్‌కు ఆయన కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫిలిం అవుతుందన్నారు. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. ఈ చిత్రంలోని ప్రతి ఒక్క సన్నివేశమూ అద్భుతంగా ఉందని ఆయన చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|