|
| డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు దౌర్జన్యం |
| శనివారం, 29 నవంబర్ 2008 ( 17:21 IST ) | |
సుదీప్ కథానాయకుడిగా, అంజలాజవేరి, ఆశాషైనీ, తనూరాయ్ కథానాయికలుగా రూపొందిన ఒక కన్నడ చిత్రాన్ని శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులోకి అనువదిస్తోంది. ఎన్.శంకర్ దర్శకత్వంలో ఎస్.వి.ఎన్. సమర్పణలో ఆర్.సుదర్శన్ రెడ్డి, కె.వి. శ్రీధర్ రెడ్డి, ఎం.సి. శేఖర్ తీస్తున్న ఈ చిత్రానికి "దౌర్జన్యం" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
సినిమాను డిసెంబరులో విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఇందులో సుదీప్ పవర్ ఫుల్ పాత్ర పోషించారని, అంజలాజవేరి గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు.దర్శకుడు సినిమాలో ప్రతి ఫ్రేమును చాలా చక్కగా మలిచారన్నారు.
యాక్షన్, సెంటిమెంట్ అంశాలను మిళతం చేసి... పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చిన ఓ యువకుడి కథతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్పారు. పట్నంలో దుష్ట రాజకీయాలు, గూండా గిరివల్ల ఇబ్బందుల పాలై, చివరికి ఆ యువకుడు వాటికి ఎలా ఎదురుతిరాడన్న కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని దర్శకుడు అన్నారు. కోట శ్రీనివాసరావు, సుబ్బరాజు, ఏవీఎస్, ఆశిష్ విద్యార్థి తదితరులు మిగిలిన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: గురుకిరణ్, ఫోటోగ్రఫీ: సుధాకర్, ఎడిటింగ్: గౌతం రాజు, సమర్పణ: ఎస్.వి.ఎస్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|