యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
అందమైన అబద్ధం ఆడియో ఆవిష్కరణ
21 నవంబర్ 2008   ( 16:37 IST )
Andamina Abaddam Still
PC
రాజా, కామ్నా జఠ్మలానీ జంటగా నటించిన చిత్రం "అందమైన అబద్ధం". రవిరాజా పినిశెట్టి దర్శకుడు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. చిత్ర నిర్మాతలు పిపి రెడ్డి, ఎం.కేశవరాజు, జొన్నాడ రమణమూర్తిలతోపాటు ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్, శ్రీనువైట్ల, ఇ.వి.వి.సత్యనారాయణ, నటులు రవితేజ, ఆర్ నారాయణమూర్తి. నాగబాబు, రాజా, కామ్నా జఠ్మలానీ, పోసాని కృష్ణమురళీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమా ఆడియోను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సినిమా టైటిల్‌కు తగ్గట్లుగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులంతా తమ జీవితంలో చోటుచేసుకున్న అందమైన అబద్దాలను ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు పినిశెట్టి మాట్లాడుతూ, తాను కావాలని కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని చెప్పారు.

చక్కని కుటుంబ కథా చిత్రం చేయాలని ఈ అందమైన అబద్ధం చేసినట్లు తెలిపారు. అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువయినా సహకరించిన నిర్మాతకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమాకు శ్రీలేఖ చక్కని బాణీలు సమకూర్చారని చెప్పారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నారు. డిసెంబరులో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తూగోలో ఓ ఉదయం... ఓ సాయంత్రం
డబ్బింగ్ పూర్తి చేసుకున్న పండుగాడు
28న ప్రేక్షకుల ముందుకు కుబేరులు
రెండు పాటలు మినహా రోమియో పూర్తి
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...