|
| డబ్బింగ్ పూర్తి చేసుకున్న పండుగాడు |
| శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 16:24 IST ) | |
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్, హన్సిక హీరోహీరోయిన్లుగా రూపొందిన "బిందాస్" చిత్రాన్ని తెలుగులో "పండుగాడు" పేరుతో జె.బాలరాజు అనువదిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేసుకుంది. గురువారం డీటీఎస్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని నిర్మాత తెలిపారు.
సీనియర్ దర్శకుడు డి.రాజేంద్రబాబు రూపొందించిన ఈ చిత్రం కన్నడంలో ఘన విజయం సాధించింది. తెలుగులోనూ అంతటి ఆదరణ పొందుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. కథ, కథనాలు ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని చూశామనే భావన కలిగిస్తాయన్నారు. రొమాంటిక్ సన్నివేశాలు, సెంటిమెంట్ సీన్స్‌లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు.
ఇటీవల చిత్ర క్లైమాక్స్‌ను గోల్కొండ పోర్ట్‌లో 20 రోజులపాటు చిత్రీకరించామని నిర్మాత వెల్లడించారు. ఈ నెలాఖరులో ఆడియోను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తామన్నారు. ఈ సినిమాలో సుమారంగనాథ్, నాజర్, సుమన్, రాహుల్‌దేవ్, వనిత, కోమల్ తదితరులు మిగిలిన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాటలు: ప్రభాకర్, పాటలు: అనంతశ్రీరామ్, రాజేంద్ర, రామ్మూర్తి, కెమెరా: వేణు, ఎడిటర్: మేనగ శ్రీను, నిర్మాత: జె.బాలరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేంద్రబాబు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|