|
| మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ |
| 20 నవంబర్ 2008 ( 16:55 IST ) | |
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్, మౌషమి ఉదేషి హీరోయిన్లు. ఈ చిత్రంతో మచ్చకంటి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ "మంత్ర" కంటే కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రమిదన్నారు. కామెడీ కూడా సమపాళ్లలో ఉంటుందని చెప్పారు. తన పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించడం త్రిల్‌గా ఉందని మౌషమి ఉదేషి అన్నారు. తానిందులో మేకప్‌లేకుండా నటిస్తున్నానట్లు శ్రద్ధదాస్ తెలిపారు.
నిర్మాత సారథి సోమా విజయ ప్రకాష్ మాట్లాడుతూ "మంత్ర" తెలుగులో హిట్టైందని, దాన్ని తమిళంలో డబ్ చేశారని చెప్పారు. హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారని, అంతగొప్పగా ఆడిన ఆ చిత్రం తర్వాత మరో చిత్రాన్ని నిర్మించాలంటే మంచి కథను ఎంపిక చేసుకోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నాల్లో ఉండగా ఈ "డైరీ" కథాంశం దొరికిందన్నారు.
ఈ నెల 19 నుంచి కేరళలో నెలరోజుల పాటు షూటింగ్ జరుపనున్నామని నిర్మాత వెల్లడించారు. ఆ తర్వాత బ్యాంకాక్‌లో మలి షెడ్యూల్ జరుగుతుందని చెప్పారు. మార్చిలో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: శ్రీనివాసరెడ్డి, సంగీతం: ఆనంద్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|