|
| అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం |
| గురువారం, 20 నవంబర్ 2008 ( 16:46 IST ) | |
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ అనే సంస్థ ఒక కొత్తచిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఇది స్క్రీన్‌ప్లే ఆధారిత కథాంశమని చిత్ర దర్శకుడు ఎం.ఎస్. చంద్ తెలిపారు. హీరో పాత్ర స్వభావం గురించి చెబుతూ... తన వల్ల ఇతరులు బాధపడకూడదని, ఇతరుల వల్ల తనూ బాధపడకూడదనే తత్వంతో ఉంటాడని చెప్పారు.
కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని దర్శకుడు వెల్లడించారు. నిర్మాత ఉషా సింగంశెట్టి మాట్లాడుతూ ఈ నెల 28వరకు తొలిషెడ్యూల్ జరుగుతుందని, ఆ తర్వాత డిసెంబర్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని తెలిపారు. జనవరిలో పాటల చిత్రీకరణ జరుపుతామన్నారు. సుప్రేన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రంలో మలిష్క, రఘుబాబు, చలపతిరావు, ఎం,ఎస్. నారాయణ, ధర్మవరపు, జయప్రకాష్ రెడ్డి, జీవా, కొండవలస, దువ్వాసి, మాధవి తదితరులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: కోటి, కెమెరా: ఎస్. సుధాకర్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎం.ఎస్. శ్రీచంద్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|