|
| 24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ |
| 20 నవంబర్ 2008 ( 08:59 IST ) | |
అల్లరినరేష్, తాన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "దొంగలబండి". జి.ఎస్.కె. నెట్‌వర్క్ పతాకంపై జి.ఎస్.కె. నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రచయిత వేగేశ్న సతీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సినిమా ఆడియోను 24న ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడించారు. ప్రస్తుతం రామకృష్ణ సినీ స్టూడియోలో నరేష్, తాన్యలపై గతంలో కృష్ణ నటించిన చిత్రంలోని ఒక పాటను పారడీగా మలుస్తున్నామన్నారు. సినిమాలో ఆరు పాటలుంటాయి. బ్యాంకాక్, పుకెట్‌లలో కొన్ని పాటలను, మిగిలినపాటలను ఫిలింసిటీలో చిత్రీకరించామని నిర్మాత తెలిపారు.
ఓ నిధి కోసం సాగే పయనమే "దొంగలబండి" ఇతివృత్తమని నిర్మాత అన్నారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలంటే.. సీరీయస్‌గానూ, హార్రర్ బేస్ చిత్రాలుగా ఉంటాయని, కానీ తమ చిత్రం పూర్తి హాస్యభరితంగా ఉంటుందని చెప్పారు. దాదాపు ఇండస్ట్రీలోని కమేడియన్లంతా ఇందులో నటించనున్నారని నిర్మాత వివరించారు.
చిత్రంలోని ప్రత్యేకతలను గురించి తెలుపుతూ.. నరమాంసభక్షకుల సెటప్, అలీ వేణుమాధవ్‌పై సాగే ఇంట్రడక్షన్ సీన్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందన్నారు. రచయిత సతీష్, నరేష్ కాంబినేషన్‌లో ఆరు హిట్స్ ఉన్నాయని, 35 చిత్రాలకు పనిచేసిన అనుభవంతో రచయిత సతీష్ కథను చక్కగా ప్రెజెంట్ చేశాడని నిర్మాత తెలిపారు. తణకు సహకరించిన అమ్మిరాజు, ఇ.వి.వి, సత్యనారాయణలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|