|
| సంక్రాతి కానుకగా జయమ్ము నిశ్చయంబురా |
| 19 నవంబర్ 2008 ( 16:51 IST ) | |
"జయమ్ము నిశ్చయంబురా...జంకు బొంకు లేక సాగిపొమ్మురా..." అంటూ అలనాటి పాటలోని చరణాన్ని టైటిల్‌గా పెట్టి నరి ఎంటర్‌టైన్‌మెంట్ కొత్తవారితో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భూపాల్, సాత్విక్, సుచరిత హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రవీందర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవీందరే దర్శకుడు.
ప్రస్తుతం సినిమా తుది షెడ్యూల్ షూటింగ్‌లో ఉంది. ఇందులో టాకీతో పాటు, మిగిలిన రెండు పాటల చిత్రీకరణ పూర్తిచేస్తామని రవీందర్ చెప్పారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత వెల్లడించారు. హాస్యభరితమైన కుటుంబకథా చిత్రంగా మలుస్తున్నామన్నారు.
దువ్వాసి మోహన్, కొండవలస, కృష్ణభగవాన్, జయలలిత తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: కీర్తిశేషులు పోచవేణి హనుమంతు, సంగీతం: అనంత్, నిర్మాణ సారథ్యం: మంద నరేందర్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|