|
| 21న శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం |
| 19 నవంబర్ 2008 ( 16:17 IST ) | |
బాబూమోహన్ కుమారుడు ఉదయ్ బాబు హీరోగా పరిచయమవుతున్న "శ్రీమేడారం సమక్క- సారక్క మహత్యం" చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకురానుంది. వేముగంటి దర్శకత్వంలో బాబూమోహన్ ఈ సినిమాను నిర్మించారు. అమ్మవారి నీడలో మా అబ్బాయి హీరోగా పరిచయమవుతున్నాడని నిర్మాత చెప్పారు. అంతా మంచే జరుగతుందని నమ్మకం ఉందన్నారు.
ఈ చిత్రంలో ఏడు పాటలున్నాయి. నటనపై తన కుమారుడికి ఉన్న ఇష్టం, అతను నటించినప్పుడే గ్రహించగలిగానని, ఇది ఇంతవరకు తెలుసుకోలేక వాడిని ప్రోత్సహించలేకపోయానని బాబుమోహన్ తెలిపారు. సమ్మక్క-సారక్క ఒక్క ప్రాంతానికి, తెలంగాణకు సంబంధించిన కథా అని చాలా మంది అడిగారు.
సమ్మక్క-సారక్క జాతరకు ఒరిస్సా, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్టాలనుంచి భక్తులొస్తుంటారు. సమ్మక్క-సారక్కలు ఒక్క ప్రాంతానికి చెందిన దేవతలు కారని ఆయన వివరణ ఇచ్చారు. అలాగే ఇదొక కుటుంబ కథా చిత్రమని చెప్పారు. వంద శాతం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిందని బాబూమోహన్ తెలియజేశారు.
ఫస్ట్ కాపీ చూసీ హ్యాపీగా ఫీల్ అయ్యానని, గ్రాఫిక్ వర్క్ నెలరోజులు పట్టిందని చెప్పారు. హీరో ఉదయ్ బాబు ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. తాను ఎన్నో సినిమాల్లో, కార్యక్రమాల్లో నవ్వించానని, తనకొడుకు నటించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి దీవించాలని బాబూ మోహన్ ఆకాంక్షించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|