|
| నింగినేల నాదేగా ఇన్‌విజిబుల్ వింగ్స్ |
| బుధవారం, 19 నవంబర్ 2008 ( 16:08 IST ) | |
హైదరాబాద్‌లో జరిగిన 2007 అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా బంగారు ఏనుగు గెలుచుకున్న "ఇన్‌విజిబుల్ వింగ్స్" అనే చైనా చిత్రాన్ని తెలుగులో "నింగినేల నాదే" అనే పేరుతో అనువదిస్తున్నారు. నాలుగేళ్ల పాప గాలిపటంతో ఆడుకుంటూ, విద్యుద్ఘాతానికి గురై రెండు చేతులు పోగొట్టుకుంటుంది.
తరువాత మానసికంగా కుంగిపోయినా... క్రమంగా కోలుకుని ఆ పాప ఆత్మవిశ్వాసంతో ముందడుగువేస్తుంది. కాలు సాయంతో ప్రతి పని చేసుకుంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుంది. మార్కులు తక్కువొచ్చి పరీక్ష ఫెయిలయ్యామని, ఎంసెట్‌లో ర్యాంక్ రాలేదని, ప్రేమించి మోసపోయామని బాధపడేవారికి "ఇన్‌విజిబుల్ వింగ్స్" మంచి స్ఫూర్తి ఇస్తుందని ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్న చావ సుధారాణి చెప్పారు.
యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. లీనింగ్ యావో ప్రధాన పాత్ర పోషించింది. సుజన్ మీడియా వర్క్స్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి మాటలు: వెన్నెలకంటి, పాట: చంద్రబోస్, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|