|
| తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత |
| మంగళవారం, 18 నవంబర్ 2008 ( 16:51 IST ) | |
కుటుంబ అనుబంధాలను కథావస్తువుగా ఎంచుకునే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ఇటువంటి కథతోనే మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధంతో దిల్ రాజు నిర్మాతగా "ఆకాశమంత" అనే చిత్రం రూపొందుతోంది. ప్రకాష్‌రాజ్, త్రిష ఇందులో తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది.
తమిళంలో ఈ సినిమాకు ప్రకాశ్‌రాజ్, తెలుగులో తాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నామని దిల్ రాజు వెల్లడించారు. "ఆర్య", "బొమ్మరిల్లు", "కొత్తబంగారులోకం" సినిమాలు ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌కు చేరువయ్యాయో, ఇది కూడా అదే కోవలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు.
సినిమాలో హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్సెన్స్. హీరోను తెరపైనే చూడాలని.. ఎందుకంటే సినిమాకు ఇదే కీలకాశంమని దిల్ రాజు తెలిపారు. విద్యాసాగర్ సంగీత దర్శకుడు. డిసెంబరు మొదటివారంలో తమిళ వెర్షన్, మూడో వారంలో తెలుగు వెర్షన్ విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సినిమా ద్వారా గుర్తిండిపోయే చిత్రంలో నటించానన్న సంతృప్తి పొందానని ప్రకాష్‌రాజ్ చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|