|
| 22న ప్రేక్షకుల ముందుకు వినాయకుడు |
| మంగళవారం, 18 నవంబర్ 2008 ( 16:28 IST ) | |
గతంలో "ఆ నలుగురు" చిత్రాన్ని అందించిన ప్రేమ్ మూవీస్ తాజాగా నిర్మించిన చిత్రం "వినాయకుడు". "హ్యాపీడేస్" ఫేం కృష్ణుడు, సోనియా ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. సాయికిరణ్ దర్శకుడు. సరిత పాట్ర నిర్మాత. ఈ సినిమాను నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు చిత్ర సమర్పకుడు ప్రేమ్ కుమార్ పాట్ర తెలిపారు.
తమ సినిమాకు ప్రారంభం నుంచి మంచి హైప్ వచ్చిందని చెప్పారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో పంపిణీ చేస్తుండగా, మిగిలిన ప్రాంతాలకు సురేష్ ప్రొడక్షన్స్ పంపిణీ హక్కులు పొందింది. చిన్న సినిమాగా ప్రారంభించినప్పటికీ, ఒక పెద్ద చిత్రానికి వచ్చినంత హైప్ వచ్చిందని దర్శకుడు సాయికిరణ్ పేర్కొన్నారు.
సినిమాలో చక్కని వినోదంతోపాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయన్నారు. సినిమా తప్పక ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా డిజైన్స్ చూసి మంచి ఆలోచనతో సినిమా మొదలుపెట్టారని అనుకున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఇలాంటి సినిమాలు తీయాలంటే దమ్ము కావాలి. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి ఫీల్ ఉన్న చిత్రమిదన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|