యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
సోమవారం, 17 నవంబర్ 2008   ( 18:23 IST )
King Still
PC
నాగార్జున, త్రిష, మమతా మోహన్‌దాస్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "కింగ్" చిత్రం ఆడియోను ఈ నెల 23న ఆవిష్కరించనున్నారు. శ్రీనువైట్ల దర్శకుడు. కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సినిమా వివరాలను తెలియజేస్తూ... మూడు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని నిర్మాత వెల్లడించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సమక్షంలో కింగ్ ఆడియో వేడుక చేస్తున్నామని తెలిపారు.

ఆడియో ఈ నెల 30న మార్కెట్‌లోకి వస్తుందని చెప్పారు. ఈ నెల 24 నుంచి డిసెంబరు మొదటివారం వరకు బ్యాంకాక్‌లో మిగిలిన పాటలను చిత్రీకరిస్తామన్నారు. దేవీశ్రీప్రసాద్ గతంలో సంగీతం సమకూర్చిన "మన్మథుడు", "మాస్" చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇదే కోవలో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని నాగార్జున నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో శ్రీహరి, దీపక్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం, కృష్ణభగవాన్, చంద్రమోహన్, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, సుప్రీత్ తదితరులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సాహితి, రామజోగయ్యశాస్త్రి, కెమెరా: ప్రసాద్ మారెళ్ల, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
టిక్కెట్ ధర పెంపుపై సర్వత్రా హర్షం
బ్యాంకాక్‌లో ఈ వయసులో పాటలు
సమస్యలపై ఎక్కుపెట్టిన అస్త్రం ఏక్‌పోలీస్
వంశీకృష్ణ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్
మళ్లీ... గుడి వెనుక... జ్యోతిలక్ష్మి
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...