|
| టిక్కెట్ ధర పెంపుపై సర్వత్రా హర్షం |
| సోమవారం, 17 నవంబర్ 2008 ( 18:12 IST ) | |
నంది అవార్డుల ప్రదాన వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎగువ తరగతి సినిమా టిక్కెట్లను రూ.35 నుంచి రూ.50కి పెంచుకునే వీలు కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పేదలు ఎక్కువగా చూసే కిందిస్థాయి తరగతుల టిక్కెట్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచారు.
ఈ నిర్ణయంపట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్యం మండలి విభాగపు అధ్యక్షుడు కెఎస్ రామారావు హర్షం వ్యక్తం చేశారు. ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయానికి కారుకులైన ముఖ్యమంత్రి, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ పార్థసారధి, మాజీ ఛైర్మన్ ఆదిశేషగిరిరావు, నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజా, దాసరి నారాయణరావులకు కృతజ్ఞతలు తెలిపారు.
వ్యాట్ తగ్గించాలని, చిన్న చిత్రాల ప్రింట్లు 35 నుంచి 75 వరకు వేసుకునే వెసులుబాటును కల్పించాలని, దీనికి పన్ను మినహాయించాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిర్మాతల సెక్టార్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ మాట్లాడుతూ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని మంచి పనులను పరిశ్రమకు వైఎస్ ఒక్కరే చేశారన్నారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|