|
| బ్యాంకాక్‌లో ఈ వయసులో పాటలు |
| శనివారం, 15 నవంబర్ 2008 ( 17:22 IST ) | |
సన్ని, యామిని హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఈ వయసులో". పసుపులేటి సుశీల్ కుమార్ నిర్మాత. బి.రమేష్ రాయల దర్శకుడు. అక్టోబరు 13న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ నెల 10తో నలభై శాతం టాకీ పూర్తి అయిందని నిర్మాత చెప్పారు.
నవంబరు 17న పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ బ్యాంకాక్ వెళుతోందని వెల్లడించారు. అక్కడ రెండు పాటలు చిత్రీకరించనున్నారు. అక్కడి నుంచి తిరిగిరాగానే డిసెంబరు 1 నుంచి చివరి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. సినిమా పూర్తయ్యే వరకు ఈ షెడ్యూల్ జరుగుతుందని నిర్మాత తెలిపారు.
కథ, కథనాలతోపాటు సంగీత దర్శకుడు శంభుప్రసాద్ అందించిన బాణీలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయన్నారు. ఒక ఐటంసాంగ్‌తోపాటు సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. డిసెంబరు నెలాఖరుకు సినిమాను పూర్తి చేసి, జనవరిలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు.
సినిమాలో జరీన్, అరుణ్‌కుమార్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, చలపతిరావు, గౌతంరాజు, హేమసుందర్, గీతాంజలి, అల్లరి సుభాషిణి, రజిత తదితురులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. మాస్టర్ పి.అభినవ్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రానికి కథ: సాయిచంద్ర, సంగీతం: శంభుప్రసాద్, కెమెరా: ఎస్‌వి శివరామ్, ఎడిటింగ్: కోలా భాస్కర్, పాటలు: వనమాలి, వరంగల్ శ్రీను, విద్యాసాగర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.రమేష్ రాయల.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|