|
| సమస్యలపై ఎక్కుపెట్టిన అస్త్రం ఏక్‌పోలీస్ |
| శనివారం, 15 నవంబర్ 2008 ( 16:02 IST ) | |
సమాజంలోని సమకాలీన సమస్యలపై ఎక్కుపెట్టిన అస్త్రంగా ఏక్‌పోలీస్ చిత్రం రూపొందిందని ఆ చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ పేర్కొన్నారు. అంతే తప్ప ఈ చిత్రం రాజకీయ ప్రచారం కోసం ఉద్ధేశించిన చిత్రం కాదని ఆయన స్పష్టం చేశారు.
గతంలో తాను భారత్‌బంద్, అంకుశం చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా ఉంటుందని ఆయన అన్నారు. సమాజం అస్తవ్యస్తంగా మారడానికి, దోపిడీలు, హత్యా రాజకీయాలు జరగడానికి కారణం ప్రజలే. ఎలాంటి ఇబ్బందినైనా భరిస్తూ ఎదిరించేందుకు ముందుకురాని ప్రజలను ప్రశ్నించేలా చేసేందుకు ప్రయత్నించే ఓ పోలీసు ఆఫీసర్ కథే ఈ ఏక్‌పోలీస్ అని ఆయన వివరించారు.
గారడీవారులాగా నేతలు ప్రజలను ఆడిస్తున్నారని అలాంటి వారికి తమ ఓటుతో సమాధానం చెప్పాలని కోరుకునే విశాల దృక్పథం ఉన్న పోలీసు ఆఫీసర్‌గా ఈ చిత్రంలో హీరో ఉంటాడని ఆయన అన్నారు. అయితే ఈ చిత్రం మాత్రం రాజకీయ ప్రచారానికి ఉద్ధేశించింది కాదని ఆయన పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|