|
| వంశీకృష్ణ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ |
| శనివారం, 15 నవంబర్ 2008 ( 15:56 IST ) | |
కాల్‌సెంటర్ ఫేం వంశీకృష్ణ హీరోగా ఓ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని కె.బి. రాజు నిర్మించనున్నారు. దర్శకుడు సాగర్ వద్ద పనిచేసిన దాసరి బ్రహ్మేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలోని కథ, కథనం ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు. ఈ కథకు వంశీకృష్ణ చక్కగా సరిపోతాడన్న ఉద్ధేశ్యంతోనే అతనిని ఎంపిక చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటివారంలో ప్రారంభించనున్నామని మిగతా విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన అన్నారు.
ఈ చిత్రాన్ని వైజాగ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత రాజు మాట్లాడుతూ కుటుంబమంతా ఆశలు పెట్టుకున్న ఓ వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో చనిపోతే వారి పరిస్థితి ఏమిటి, అటుపై జరిగిన పరిణామాలేంటనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుందని పేర్కొన్నారు.
ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్న ఎస్.ఎ. ఖుద్దూస్ మాట్లాడుతూ ఈ చిత్రంలో రెండు పాటలుంటాయని కథ పరంగా రీరికార్డింగ్‌కు చక్కని అవకాశముందని తెలిపారు. హీరో వంశీకృష్ణ మాట్లాడుతూ తెలుగులో తనకిది మూడవ చిత్రమని తెలిపారు. రొటీన్ ప్రేమకథగా కాకుండా ఈ చిత్రం వైవిధ్యంగా ఉంటుందని వంశీకృష్ణ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|