యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
మళ్లీ... గుడి వెనుక... జ్యోతిలక్ష్మి
శుక్రవారం, 14 నవంబర్ 2008   ( 15:44 IST )
Kuberulu Still
PC
"ఇదా లోకం" చిత్రంలోని "గుడి వెనుక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు..." పాటను "కుబేరుల" సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారు. పాత పాటలో నర్తించిన జ్యోతిలక్ష్మి రీమిక్స్‌లోనూ డాన్స్ చేయడం విశేషం. "కుబేరులు" చిత్రంలో శివాజీ, అలీ, కృష్ణ భగవాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఫర్జానా కథానాయిక. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. ఈ సినిమా టైటిల్‌కు "వీళ్లకు అన్ని అప్పులే" అనే ఉప శీర్షిక జోడించారు. కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్ నిర్మాతలు. జ్యోతిలక్ష్మి, శివప్రసాద్, షేక్‌లపై నానక్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో గురువారం పైపాటను చిత్రీకరించారు. స్వర్ణ ఈ పాటకు కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు.

ఈ పాటతో చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయిందని దర్శకుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫోక్‌లోసాగే ఈ రీమిక్స్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందన్నారు. సినిమాను ఈ నెల 28న విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. చాలాకాలం తరువాత తెలుగులో నటిస్తుండటంపట్ల జ్యోతిలక్ష్మి ఆనందం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
28న దేవరకొండ వీరయ్య విడుదల
జానకి చెంతకు సుశీల జాతీయ అవార్డు
అందరినీ నమ్మడం నా బలహీనత: బిందు
యువలోకంగా మధుబాల కభీ సోచాభి నా థా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అందరినీ నమ్మడం నా బలహీనత: బిందు
అందరినీ నమ్మడం తన బలహీనతని "ఆవకాయ్ బిర్యాని"తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం...
యువలోకంగా మధుబాల కభీ సోచాభి నా థా
ఎన్నడూ వ్యక్తుల్ని దూషించలేదు: పోసాని
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...