|
| గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం |
| శుక్రవారం, 14 నవంబర్ 2008 ( 15:27 IST ) | |
గోపీచంద్, అనుష్క జంటగా కెమెరామెన్ శివ దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన శౌర్యం చిత్రం ఇటీవలే అర్థ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ తాము ఏ నమ్మకంతో సినిమా మొదలు పెట్టామో దాన్ని ప్రేక్షకులు నిజం చేశారని అన్నారు. అందుకే ప్రేక్షకులకు తాను ముందుగా ధన్యవాదాలు తెల్పుతున్నానని గోపీచంద్ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఆనందంగా ఉన్నారని, సినిమాకు లాభాలు వస్తున్నాయని, ఈ చిత్రం ద్వారా సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరిశ్రమకు పరిచయం అయ్యారని గోపీచంద్ అన్నారు.
దర్శకుడు శివ మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ చిత్రం ద్వారా తనకు అవకాశం ఇచ్చినందుకు హీరో గోపీచంద్‌కు, నిర్మాతకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ డైరెక్టర్ శివను గోపీచంద్ పరిచయం చేశారని ఆయన మీద ఉన్న నమ్మకంతో తాను చిత్రాన్ని నిర్మించానని పేర్కొన్నారు.
గోపీచంద్ నటించిన అన్ని చిత్రాల్లోకి ఇది భారీ బడ్జెట్ చిత్రమని, అత్యధిక థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని తాము విడుదల చేశామని ఆయన అన్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల సభలో తాము నిర్వహించిన ఆడియో క్యాసెట్ వేలం పాటలో తొలి క్యాసెట్‌ను దండమూరి బాలకృష్ణగారు 80 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారని ఆ మొత్తాన్ని బీఫార్మసీ చదువుతున్న పేద విద్యార్ధిని రూబియా జబీన్ చదువు కోసం అందజేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|