యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
పిసినారి ప్రేమను చూపించే నిన్నే చేరాలని
NinneCheralani Still
PC
పిసినారి ప్రేమలో పడితే ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వివరించే కథాంశంతో "నిన్నే చేరాలని" చిత్రం రూపొందుతుంది. గడ్డం, క్రాఫ్ చేయించాలంటే ఖర్చవుతుందని, ప్రతిదానికి లెక్కలేస్తూ ఏదో లాజిక్కులు చెప్పే హీరో డబ్బుతో పనిలేని ప్రేమలో పడతాడు.

పక్క ఊరికి చెందిన సాంప్రదాయ కుటుంబానికి చెందిన పొదుపరి అమ్మాయిని చూసి పిసినారి స్వభావం కలిగిన క్లాస్‌ హీరో ప్లాట్ అవతాడు. అదే సమయంలో ఖర్చుకు వెనుకాడని మరో యువకుడు కూడా ఆ అమ్మాయినే చూసి ప్రేమలో పడతాడు.

అయితే ఆ అమ్మాయి ఎవరినీ ప్రేమించింది... పిసినారి ప్రేమ ఏమయిందనే కథాంశంతో "నిన్నే చేరాలని" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు వి.వి.వి. సత్యనారాయణ తెలిపారు. శారదా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ బుధవారం సారథి స్టూడియోలో ప్రారంభమైంది.

పిసినారి పాత్రలో బాలాదిత్య, ఖర్చుకు లెక్కచేయని యువకుని పాత్రలో నిఖిల్, పొదుపరి యువతి పాత్రలో మౌనిక నటిస్తున్నారు. ఈ ముక్కోణపు ప్రేమ కథను బుధవారం నుంచి ఏకధాటిగా జరిగే ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేస్తామని చిత్ర నిర్మాత డి. లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సినిమాకు అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
షూటింగ్ పూర్తి చేసుకున్న అంజనీపుత్రుడు
సమర్థుడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో కృష్ణంరాజు
బాలకృష్ణ తరువాతి చిత్రంపై ఫిలింనగర్‌లో చర్చ
ఆ సినిమా కోసం శాయశక్తులా ప్రయత్నించా: ఇలియానా
రాష్ట్ర మంత్రిచే కాలచక్రం ఆడియో ఆవిష్కరణ
సంగీతాన్ని కొత్తగా ఎవరూ సృష్టించలేరు: ఇళయరాజా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...