యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
సమర్థుడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో కృష్ణంరాజు
Samarthudu Still
PC
రెబల్‌స్టార్ కృష్ణంరాజు "సమర్థుడు" అనే పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో ఎమ్మెల్యే పాత్ర పోషిస్తున్నారు. రెగ్యులర్ పాత్ర కాకపోవడంతో ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నానని కృష్ణంరాజు తెలిపారు. ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలి. బాధ్యతలు మరిస్తే శిక్షింపబడాలనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతుందని చెప్పారు.

చిత్ర దర్శకుడు అర్జున్ గురించి చెబుతూ, కొత్తవాడు అయినప్పటికీ కథ చెప్పే విధానం బాగా నచ్చిందన్నారు. క్యారెక్టర్ నాకు నచ్చితే, నా భార్య శ్యామలాదేవికి కథంతా నచ్చింది. దీంతో ముందుగా అనుకున్న గోపీకృష్ణా మూవీస్‌ సినిమాను పక్కనబెట్టి "సమర్థుడు"లో నటించాలని నిర్ణయించుకున్నట్టు కృష్ణంరాజు తెలిపారు.

"సమర్థుడు" చిత్రాన్ని దేవిక ప్రొడక్షన్స్, ఆరెంజ్ ఫ్రేమ్ సంయుక్తంగా నిర్మిస్తోంది. రాజా మాస్ పాత్ర పోషిస్తున్నారు. ప్రజల కోసం ప్రాణాలిచ్చే నాయకుడికి, డబ్బుకోసం ప్రాణాలు తీసే హంతకుడికి మధ్య జరిగే కథే "సమర్థుడు" అని చిత్ర దర్శకుడు అర్జున్ వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. "బుజ్జిగాడు మేడిన్ చెన్నై"లో రెండో హీరోయిన్‌గా నటించిన సంజన ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
షూటింగ్ పూర్తి చేసుకున్న అంజనీపుత్రుడు
పిసినారి ప్రేమను చూపించే నిన్నే చేరాలని
బాలకృష్ణ తరువాతి చిత్రంపై ఫిలింనగర్‌లో చర్చ
ఆ సినిమా కోసం శాయశక్తులా ప్రయత్నించా: ఇలియానా
రాష్ట్ర మంత్రిచే కాలచక్రం ఆడియో ఆవిష్కరణ
సంగీతాన్ని కొత్తగా ఎవరూ సృష్టించలేరు: ఇళయరాజా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...