యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
సంగీతాన్ని కొత్తగా ఎవరూ సృష్టించలేరు: ఇళయరాజా
Ilayaraja
PC
ఎగిరే పక్షిని ఫొటోతీసి, దానిని కంప్యూటర్‌లో పెట్టి రకరకాలుగా చూపించవచ్చు. అయితే సంగీతం మాత్రం కంప్యూటర్ పక్షి కాదని స్వరచక్రవర్తి ఇళయరాజా చెప్పారు. భూమిక హీరోయిన్‌గా నటిస్తున్న "మల్లెపూవు" ఆడియో వేడుకలో ఇళయరాజా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగీతాన్ని కొత్తగా ఎవరూ సృష్టించలేరని చెప్పారు. ఉన్న షడ్జమంతోనే ఏదైనా చేస్తున్నామన్నారు. స్వరం, సంగీతం దానికది సంభవించాలని పేర్కొన్నారు. నాకూ సంగీతం గురించి తెలియదు. నిరంతరం దాని గురించి తెలుకునే ప్రయత్నం చేస్తున్నానని ఇళయరాజా తెలిపారు. సంగీతం దానంతట అదే ఉద్భవిస్తుందన్నారు.

చిత్ర దర్శకుడు రమేష్ వర్మ గతంలో ఒక సినిమాకు సంగీతం అందించమని కోరారు. చేయడం కుదరలేదు. ఈసారి వేటూరి రికమండేషన్‌తో వచ్చారు. కథ ఒకసారి వినమన్నారు. రమేష్‌ వర్మ చెప్పిన కథ నచ్చడంతో సంగీతం సమకూర్చేందుకు అంగీకరించానని ఇళయరాజా తెలిపారు.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియోను మార్కెట్‌లోకి విడుదల చేశారు. నటి జయసుధ తొలి క్యాసెట్‌ను ఆవిష్కరించి తారకరత్నకు అందించారు. అనంతరం తొలి సీడీని నిర్మాత డి.సురేష్ బాబు ఆవిష్కరించి, తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. ఇళయరాజా చాలాకాలం తరువాత తెలుగుచిత్రానికి సంగీతం అందించడం పట్ల ఈ ఆడియో వేడుకలో పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శ్రీకాంత్, మీరాజాస్మిన్ జంటగా అ..ఆ..ఇ..ఈ
ఆగస్టు 15లోగానే బలాదూర్ విడుదల చేస్తాం: నిర్మాత
రజనీ చేతులమీదగా సరోజ ఆడియో ఆవిష్కరణ
రామ్‌గోపాల్ చేతుల మీదుగా హోమం ఆడియో
గుండె ఝల్లుమంది ఆడియో విడుదల
వైభవంగా సంతోషం సినీ అవార్డులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...