యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
శ్రీకాంత్, మీరాజాస్మిన్ జంటగా అ..ఆ..ఇ..ఈ
Srikanth
PC
శ్రీకాంత్, మీరాజాస్మిన్ జంటగా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా పేరు అ..ఆ..ఇ..ఈ (అతను ఆమె.. ఇంతలో ఈమె). శ్రీకల్పన ఆర్ట్స్ పతాకంపై బొద్దం అశోక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదిరిందయ్యా చంద్రం, టాటాబిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్లీ మొదలైంది, చందనా బ్రదర్స్- బొమ్మనా సిస్టర్స్ చిత్రాల దర్శకుడు శ్రీనివాసరెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా విశేషాలను తెలియజేసేందుకు సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన సినిమాలు విజయవంతం అవడానికి టైటిల్స్ వెరైటీగా దొరకడం కూడా ఒక కారణమన్నారు. వెరైటీ టైటిళ్లు దొరికితే సినిమాకు సగం సక్సెస్‌గా తాను భావిస్తానన్నారు.

విజయ్‌కుమార్ ఫొటోగ్రఫీతో సినిమా చేయాలనే తన కోరిక ఈ సినిమాతో నెరవేరబోతుందని దర్శకుడు తెలిపారు. శ్రీకాంత్, మీరాజాస్మిన్ జంటగా శ్రీనివాసరెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది. గత చిత్రాలకంటే ఈ సినిమాకు మంచి కథ దొరికిందని దర్శకుడు చెప్పారు. కామెడీతోపాటు సెంటిమెంట్‌ కూడా కథలో మిళితం అయి ఉంటుందన్నారు.

ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని నిర్మాత తెలిపారు. శ్రీనివాసరెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే రోజుల నుంచి తనకు తెలుసని చెప్పారు. తాను నిర్మించిన ఎనిమిదో చిత్రం "ఆషాడం పెళ్లికొడుకు"తో ఆయన దర్శకునిగా పరిచయం అయ్యారు. ఎస్‌వీ కృష్ణారెడ్డి, ఇవివి సత్యనారాయణ పంథాలోనే శ్రీనివాసరెడ్డి కూడా వెళుతున్నారు. శ్రీనివాసరెడ్డి నిర్మాతలకు కూడా అనువైన దర్శకుడు అని ప్రశంసించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆగస్టు 15లోగానే బలాదూర్ విడుదల చేస్తాం: నిర్మాత
రజనీ చేతులమీదగా సరోజ ఆడియో ఆవిష్కరణ
రామ్‌గోపాల్ చేతుల మీదుగా హోమం ఆడియో
గుండె ఝల్లుమంది ఆడియో విడుదల
వైభవంగా సంతోషం సినీ అవార్డులు
సెప్టెంబర్ నెలాఖరులో మిస్టర్ గిరీశం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...