|
| ఎవరినీ కించపరిచేందుకు కాదు: నిర్మాతల మండలి |
సినిమాలు తీసేది ఎవరినీ కించపరిచేందుకు కాదని నిర్మాతల మండలి పేర్కొంది. గత కొన్ని రోజులుగా కొన్ని సినిమాలలో దళిత వర్గాలను, వికలాంగులను కించపరిచారని పలువురు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో నిర్మాతల మండలి ఈ మేరకు ప్రకటించింది.
కాగా, దీనికి సంబంధించి సెన్సార్ బోర్డు కొన్ని నిబంధనలను నిర్మాతల మండలి ముందు ఉంచింది. అవి పరిశీలించిన అనంతరం సినిమాలు తీయాలంటేనే భయమేస్తోందని నిర్మతాలు ఏకాభిప్రాయానికి వచ్చారు. దీనికి సంబంధించి గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు అయ్యింది.
తాము నిర్మించే చిత్రాలు ఎవరినీ బాధపెట్టాలని కాదని నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కోట్లాది మంది ప్రజల కోసం తాము చిత్రాలు తీస్తున్నారని, ఎవరినీ కించపరిచేందుకు కాదని ఆయన స్పష్టం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|