|
| రాజా హీరోగా ప్రారంభమయిన చిత్ర షూటింగ్ |
రాజా హీరోగా, ముంబై నటి తీర్థను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ శ్రావ్య ఫిలింస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి సంబంధించి గురువారం నాడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చిత్ర నిర్మాతలు కె.బసిరెడ్డి, రవీంద్రబాబులు మాట్లాడుతూ శుక్రవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి సెప్టెంబర్‌లో పూర్తి చేస్తామని తెలిపారు.
అనంతరం దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చిత్ర కథ గురించి చెబుతూ ఈ ఏడాది వచ్చిన చిత్రాలలో ఈ చిత్రం ఉత్తమమైనదిగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చక్కని కథకు సరైన ఆర్టిస్టులు దొరికారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్యంలో ప్రారంభమయి అర్బన్ నేపథ్యంలో ముగిసే కథ అని చెప్పారు.
అనంతరం తనికెళ్ల భరణి మాట్లాడుతూ ఇంతవరకు చేయని పాత్రలో రాజా నటిస్తున్నట్టు చెప్పారు. తన పాత్ర గురించి వివరిస్తూ, రోటీన్‌గా చేసే పాత్రే తనది అని అన్నారు. కాగా, సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో నాలుగు పాటలున్నాయని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|