|
| బ్లేడ్‌బాబ్జీ ఆడియో విడుదలకు ఏర్పాట్లు |
నరేష్, సయాలీ భగత్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన బ్లేడ్‌బాబ్జీ చిత్ర ఆడియోను ఈ నెల 21న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని దర్శకుడు దేవీప్రసాద్ వెల్లడించారు. ఆడియో విడుదలకు సంబంధించి దాదాపు అన్నీ పనులు పూర్తి అయ్యాయని, ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ జరుపుకుంటోందని అన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, కథ గురించి వివరించారు. దొంగతనాన్ని వృత్తిగా పెట్టుకున్న వ్యక్తి ఒకే సారి పోలీసుగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశాన్ని వినోదాత్మకంగా చిత్రించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో నెగటివ్ పాత్రలు లేవని ఆయన అన్నారు. ప్రతి పాత్ర తమ వంతు హాస్యాన్ని పండించాయని చెప్పారు.
కోటి అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటాయని తెలిపారు. అనంతరం నిర్మాత సత్యకుమార్ మాట్లాడుతూ, రీరికార్డింగ్‌తో పాటు డి.టి.ఎస్ మిక్సింగ్ కూడా జరుగుతోందని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|