|
| ఫిలింఫేర్ అవార్డులు: ఉత్తమ నటీనటులు త్రిష, ఎన్టీఆర్ |
చెన్నైలో జరిగిన 2007 సంవత్సర ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో హ్యాపీడేస్ చిత్రానికి అవార్డుల పంటపడింది. ఈ చిత్రానికి ఐదు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఉత్తమ నటీనటుల అవార్డులను త్రిష (ఆడువారి మాటలకు అర్థాలే వేరులే), జూనియర్ ఎన్టీఆర్ (యమదొంగ) అందుకున్నారు.
ఈ అవార్డు ప్రధాన కార్యక్రమం శనివారం రాత్రి చెన్నైలోని నెహ్రా స్టేడియంలో ఘనంగా జరిగింది. రామ్‌చరణ్‌తేజ (చిరుత) ఉత్తమ నూతన నటుడి అవార్డును అందుకున్నారు. ఉత్తమ సహాయనటుడి అవార్డు జగపతిబాబు (లక్ష్యం)కు దక్కింది. హ్యాపీడేస్ ఉత్తమ చిత్రంగా నిలవగా, ఈ సినిమా సంగీతం అందించిన మిక్కీజే మేయర్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు అందుకున్నారు.
హ్యాపీడేస్‌లో నటించిన సోనియా ఉత్తమ సహాయనటి అవార్డును, ఉత్తమ గేయరచయిత వనమాలి (హ్యాపీడేస్), నేపథ్యగాయకుడిగా కార్తీక్ (హ్యాపీడేస్) అవార్డులు దక్కించుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాళం చిత్రాల ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానం కూడా ఇదే వేదికపై జరిగింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి స్నేహ. గ్లామర్‌కు తావివ్వకుండా సహజసిద్ధంగా నటించి... |
| |
|
|
|
|
|
|
|