|
| పార్థు ఆడియో ఆవిష్కరణ |
తొలుత నృత్య దర్శకుడిగా.. అతర్వాత నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన రాఘవలారెన్స్ దర్శకత్వం వహించిన పార్ధు చిత్రంలో స్నేహ హీరోయిన్‌గా నటిస్తోంది. మన్యం ఎంటర్‌టైనమెంట్స్‌పై మన్యం రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి గురువారం నాడు విడుదలయ్యాయి.
శిల్పారామంలో జరిగిన ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వీవీ వినాయక్ కేసెట్టు ఆవిష్కరించగా, ఆడియో సీడీని అల్లు అర్జున్ విడుదల చేశారు. ముందుగా పాటలను వినిపించారు. అనంతరం వారి అభిప్రాయాలను తెలియజేయమని కోరగా, వినాయక్ స్పందిస్తూ.. నేను పాటను జడ్జి చేయలేను.
నేను స్వతహాగా మాస్ దర్శకుడినైనా మెలోడి అంటే ఇష్టం. లారెన్స్ ఈ పాటలకు బాగా డాన్స్ చేశాడని మాత్రం చెప్పగలనన్నారు. అర్జున్ మాట్లాడుతూ సెక్సీ, సెక్సీ అనే సాంగ్ చాలా బాగుందన్నాడు. లారెన్స్ మాట్లాడుతూ తల్లి చనిపోతే పడే బాధను.. ప్రధానాంశంగా తల్లి సెంటిమెంట్‌పై తెరకెక్కిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామన్నాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|