యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంటూ, కనీసం తను నిర్మిస్తున్న చిత్రాల గురించి అడిగితే గాని వివరాలు చెప్పని అశ్వనీదత్ సోమవారం నాడు మీడియాకు షాక్ ఇచ్చారు. కంత్రి చిత్రం గురించి నాలుగు మాటలు మాట్లాడేందుకు సోమవారం రాత్రి విందు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తన మనసులోని మాటలను వెలిబుచ్చుతూ.. మా వైజయంతీ మూవీస్ పతాకంపై అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు సుమారు 33 సంవత్సరాలుగా చిత్రాలను నిర్మిస్తున్నాం. అయితే చాలా సార్లు మీడియాను కలవాలనుకున్నా కలవలేకపోయాను.

అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం విడుదలై మూడు రోజులు కావస్తోంది. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయిన సందర్భంగా కలుస్తున్నాను. మూడురోజుల్లోనే ఎలా చెప్పగలమన్న సందేహం రావచ్చు, కానీ అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక్క మెతుకు చాలు కదా అని చమత్కరించారు.

మా వైజయంతీ మూవీస్ బేనరుకు కె. రాఘవేంద్రరావు, బి. గోపాల్ వంటి ప్రముఖ దర్శకులు చేయడం వల్ల పేరు ప్రఖ్యాతులు ఇనుమడించాయన్నారు. కంత్రి చిత్రాన్ని మెహరరమేష్ అద్భుతంగా తీశాడని అశ్వనీదత్ ప్రశంసించాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
విక్టరీ కోసం తంటాలు పడ్డాను: నితిన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...