|
| బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ |
బ్లేడునే నమ్ముకుని దాన్నే జీవితంగా బతికేస్తున్న బాబ్జీ కథతో బ్లేడు బాబ్జీ సినిమా రూపొందుతోంది. అల్లరి నరేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఆయన సరసన గుజరాత్ నటి సయాలీభగత్ నటిస్తోంది. సత్యమూవీస్ పతాకంపై ముత్యాల సత్యకుమార్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటివరకు రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. ఆ రెండు పాటలకు సంబంధించి బ్యాంకాక్‌కు వెళ్లనున్నట్లు దేవిశ్రీ వెల్లడించారు. మరోవైపు పొస్ట్‌ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, జూన్ రెండోవారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
విజయం కోసం ఇష్టంగా కష్టపడి చేసిన ఈ చిత్రం పూర్తి ఎంటర్‌రటైన్‌మెంట్‌గా సాగుతుందన్నారు. నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి ఏ మాత్రం క్రెడిట్ దక్కినా అది దర్శకుడు, రచయితలదేనన్నాడు. గత చిత్రాలకంటే ఓ మెట్టు పైనుండాలనే ప్రయత్నమే ఈ చిత్రం చేశానని పేర్కొన్నారు.
కథానాయిక సయాలీభగత్ మాట్లాడుతూ 2004 మిస్ ఇండియా ఎంపిక తర్వాత ట్రైన్ అనే చిత్రంలో నటించానని తెలిపింది. ఈ చిత్రంలో ఇంకా రుతిక, కౌష, బ్రహ్మానందం, వేణుమాధవ్, హేమసుందర్, హర్షవర్ధన్, ఖయ్యూం, దేవిశ్రీ, బాలాజీ, తెలంగాణా శకుంతల నటించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|