యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
నితిన్, మమతామోహన్‌దాస్ కాంబినేషన్‌లో ఆర్ఆర్ మూవీమేకర్స్ పతాకంపై రూపొందుతున్న విక్టరీ చిత్ర ఆడియో ఆవిష్కరణ సోమవారం రాత్రి జరిగింది. డా. డి రామానాయుడు ఆవిష్కరించి ఎంఎస్ రాజుకు అందించారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ, సంపత్‌రెడ్డి, వెంకట్ కోచ్‌ల పర్యవేక్షణలో 8ప్యాక్ బాడిగా నన్ను తీర్చిదిద్దారు.

చక్రి స్వరపరిచిన టక్కరి, ఆటాడిస్తా తర్వాత వస్తోన్న విక్టరీ చిత్రం హ్యాట్రిక్ సాధిస్తుందనే నమ్మకముంది. ఇందులో నటునిగా నాలో మెచ్యూరిటీని దర్శకుడు రవి సి కుమార్ చూపించారని వ్యాఖ్యానించాడు. చక్రి మాట్లాడుతూ, నితిన్ ఎనర్జీ ఏమిటో మొదటి సాంగ్‌లోనే తెలిసిపోయిందన్నారు.

చంద్రబోస్, కలువకృష్ణసాయిలు సాహిత్యం బాగా రాశారన్నారు. క్వాలిటీ కోసం ఆలస్యమైనా నాచేత ట్యూన్స్ కట్టించిన దర్శకుడికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు. సుధాకరరెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థ ఏడాదికి ఓ సినిమాను నిర్మిస్తుండగా.. ఈసారి నిర్మిస్తున్న చిత్రంలో చక్రి సంగీతం హైలెట్‌గా నిలుస్తుందన్నారు. ఈ చిత్రాన్ని నెలాఖరులోగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
విక్టరీ కోసం తంటాలు పడ్డాను: నితిన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...