|
| అధినాయకుడిగా నాగబాబు | | - డీవీ |
| మంగళవారం, 6 మే 2008 ( 12:06 IST ) |
|
ప్రముఖ నటుడు నాగబాబు హీరోగా ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అధినాయకుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో చిరంజీవీ రాజకీయ రంగప్రవేశానికంటూ ఆయన నటించే సినిమా అధినాయకుడనే ప్రచారం వచ్చింది.
కానీ మారిన పరిస్థితుల రీత్యా ఆటైటిల్‌ను ఆయన సోదరుడు నాగబాబు వాడుకుంటున్నారు. భాస్కరరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం పలు రాజకీయాంశాల ప్రస్తావనతో రూపొందుతోంది. దీంట్లో పోలీసు కమిషనర్ పాత్రను నాగబాబు పోషిస్తున్నారు. ఇంతకముందు ఆపరేషన్ ధుర్యోధనలో వైవిధ్యమైన పోలీసుపాత్రను ఆయన పోషించిన సంగతి విదితమే.
మరి దాని కంటే గొప్పగా అవినీతిపై జరిపే పోరాటంలో ఈ పాత్ర సాగుతుందని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే మిగిలిన వివరాలు కూడా వెల్లడికానున్నట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం... |
| |
|
|
|
|
|
|
|