|
| ఇదీ అసలు కథ చిత్రం టాకీ పూర్తి | | - డీవీ |
| సోమవారం, 5 మే 2008 ( 12:16 IST ) |
|
బ్యాచిలర్స్, కుచ్చికుచ్చి కూనమ్మ చిత్రాల్లో నటించిన జాకీర్ దర్శకుడిగా మారి విజయమాధవి మూవీస్ పతాకంపై ఇదీ అసలు కథ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏవీఎన్ సింగ్, ఆకాంక్ష హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎంఏ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టాకీ పూర్తి అయిన సందర్భంగా ఫిలింఛాంబర్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ముందుగా దర్శకుడు మాట్లాడుతూ సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని.. హిచ్‌కాక్ చిత్రాల నేపథ్యంలో ఈ చిత్రముంటుందన్నారు. రెండు సంవత్సరాల నాడు కథను సిద్ధం చేసుకున్నాను. రాజగారికి కథ నచ్చి నాకు దర్శకునిగా అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 18న షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు.
ప్రస్తుతానికి టాకీ పార్టు పూర్తయింది. సోమవారం నుంచి 15 రోజల పాటు పాటల చిత్రీకరణ జరుగనుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ రెండో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఎంఏ రాజు మాట్లాడుతూ బ్లాక్ మెయిల్ నేపధ్యంలో కథ రూపొందుతోందన్నారు.
ఎవరు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తారు అన్న దానిపై కథ నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఘంటాడికృష్ణ స్వరపరిచిన బాణీలు ప్రేక్షాధరణ పొందగలవని ఆశిస్తున్నామని రాజు వ్యాఖ్యానించారు. కథానాయకుడు ఏవీఎన్ సింగ్ మాట్లాడుతూ ముంబాయిలో మోడలింగ్‌లో ఉన్న తాను ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నాను.. తొలి చిత్రంలోనే థ్రిల్లింగ్ కలిగించే అంశాలతో కూడిన చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉన్నట్లు తెలిపాడు.
కాగా, ఈ చిత్రానికి పాటలు తైదలబాపు, సమర్పణ మాస్టర్ ప్రణయ్ ఫణీంద్రవర్మ, కెమేరా మురళీకృష్ణ షూట్ చేస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం... |
| |
|
|
|
|
|
|
|