|
| తమిళ దర్శకుడు తెలుగులోకి |
తమిళ కథానాయకుడు విజయ్‌ను చంద్రలేఖ చిత్రం ద్వారా పరిచయం చేసిన ఎంజీఆర్ నంబి తొలిసారిగా తెలుగులో చిత్రం చేయనున్నారు. తమిళంలో నిళ, చంద్రలేఖ, మంజరిన్‌లా, అన్బే ఓడివ వంటి 23 చిత్రాలకు దర్శకత్వం, అలాగే 18 సినిమాలకు నిర్మాతగా వ్యవహించారు. తాజాగా తెలుగులో కొత్త వారితో ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ సందర్భంగా నంబి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రముఖ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్రలో పొరుత్తిరు చిత్రాన్ని చేస్తున్నట్లు తెలిపారు. తాను తెలుగులో చేయాలని ఎప్పటినుంచే కోరిక ఉండేదని.. అది ఇప్పుడు తీరబోతున్నందుకు సంతోషంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు.
కాగా, మే నెలాఖరున తెలుగు చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభిస్తామని.. హైదరాబాద్, విశాఖపట్నంలలో తీయనున్నట్లు పేర్కొన్నారు. మా ఆయన బంగారం చిత్రానికి కథను అందించానని.. ఇప్పుడు తానే నేరుగా మంచి కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకువస్తున్నట్లు ధీమావ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి సంగీతం విద్యాసాగర్.. దర్శక, నిర్మాతలుగా ఎంజీఆర్ నంబి బాధ్యతలు వహిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|