|
| మీరాజాస్మిన్ ప్రధానంగా ఒకటి నాలుగు చిత్రం |
రాజ్‌కంబైన్స్ సంస్థ రూపొందించనున్న ఒకటీ నాలుగు చిత్రంలో మలయాళ ముద్దుబొద్దుగుమ్మ మీరాజాస్మిన్ ప్రధాన పాత్రలో నటించనుంది. ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి అగస్థ్య స్వరకల్పన చేస్తున్నారు. వెంకట్ బాబి రచన సహకారం అందిస్తున్నారు.
హైదరాబాద్‌లో ప్రసాద్‌ల్యాబ్స్ ఆవరణలో ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అక్కడకు ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ప్రముఖుల్లో ఒకరైన రాష్ట్రమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ చక్కటి సందేశంతో మహిళా కథగా తెరకెక్కిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.
అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ ఒకమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని ఏవిధంగా ఎదుర్కొంది.. ఇది తెలసిన నలుగురు వ్యక్తులు ఏవిధంగా సాయపడ్డారు.. చివరికి తామనుకున్నది సాధించారా లేదా.. అన్నది కథ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే మూడు పాటలు రికార్డ్ అయినట్లు తెలిపారు. ఈ చిత్రంలో ఇంకా ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మానందం, మాస్టర్ భరత్, హేమ, పద్మాజయంతి తదితరులు నటిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|