|
| జగపతిబాబు ప్రధాన పాత్రలో తరుణ్ చిత్రం |
తరుణ్, ఇలియానాలు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్నారు. శ్రీలక్ష్మీ ప్రొడక్షన్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్ర విశేషాల గురించి దర్శకుడు విజయభాస్కర్ మాట్లాడుతూ ఆద్యంతం ఈ చిత్రం వినోదభరితంగా ఉండేలా రూపొందిస్తున్నామని తెలిపారు. మార్చిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తవుతుందని ఆయన అన్నారు. ఏప్రిల్ లేదా మేలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
సమర్పుకుడు బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ విజయభాస్కర్ గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా వినోదభరితంగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రం ద్వారా జగన్ కెమెరామెన్‌గా పరిచయమవుతున్నారని చెప్పారు.
తరుణ్ మాట్లాడుతూ నువ్వేకావాలి తర్వాత విజయభాస్కర్‌తో కలిసి చేస్తున్న ఈ చిత్రం కూడా పూర్తి ఎంటర్‌టైనర్‌గా సాగినా సెంటిమెంటుకు కూడా ఇందులో స్థానముందని తెలిపారు. పద్దెనిమిదేళ్ళ క్రితం పిల్లలు దిద్దిన కాపురంలో చైల్డ్ ఆర్టిస్టుగా జగపతిబాబుతో కలిసి పనిచేశానని, ఇప్పుడు ఈ చిత్రం ద్వారా మరలా కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను పోలీసాఫీసరుగా నటిస్తున్నానని తరుణ్ దొంగ కొడుకుగా నటిస్తున్నారని చెప్పారు. నిర్మాత శాఖమూరి పాండురంగారావు మాట్లాడుతూ అందరి సహాకారంతో అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేయగల్గుతున్నామని అన్నారు. త్వరలో ఆడియోను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రంలో ప్రదీప్‌సింగ్‌రావత్, బ్రహ్మానందం, ఎం.ఎస్. నారాయణ, సునీల్, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్, సుధ, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు- అబ్బూరి రవి, పాటలు- వేటూరి, భువనచంద్ర, చంద్రబోస్, సాహితీ, సంగీతం- కె.ఎం. రాధాకృష్ణన్, కథ-, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- విజయభాస్కర్. కె.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|