|
| కలైంజర్ టీవీ కోసం సీరియళ్ల తయారీకి రెడీ: రాధిక |
| చెన్నై (ఏజెన్సీ), బుధవారం, 23 మే 2007 | |
కలైంజర్ టీవీ ఛానల్‌కు సీరియళ్లు నిర్మించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాడాన్ టీవీ అధినేత్రి, ప్రముఖ సినీ తార, టెలివిజన్ సీరియల్ నిర్మాత రాధికా శరత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఆమె సన్ టీవీ నెట్‌వర్క్‌కు పలు కుటుంబ కథా సీరియళ్లను అందించిన విషయం తెలిసిందే.
అటువంటి కార్యక్రమాలనే ఆగస్టు 15న ప్రారంభమయ్యే కలైంజర్ టీవీ ఛానల్‌కు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నానని ఆమె తెలిపారు. ఆ అంశంపై ముఖ్యమంత్రి కరుణానిధితో మంగళవారం ఆమె సమావేశం జరిపారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ అంశంపై కరుణానిధి తనతో చర్చించారని ప్రకటించారు.
అయితే పూర్తి స్థాయిలో వివరాలు అందించలేదని ఆమె అన్నారు. కలైంజర్ తనకు తండ్రి లాంటి వారని, ఆ సమావేశం గురించి అపోహలు అనవసరమని ఆమె చెప్పారు. ఆమె భర్త శరత్ కుమార్ ఇటీవల కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే.
కరుణానిధితో సమావేశం ముఖ్యంగా తన తండ్రి, సినీనటుడు దివంగత ఎమ్మార్ రాధ శతజయంతి ఉత్సవాల గురించి మాత్రమేనని స్పష్టం చేశారు. దయానిధి మారన్ కుటుంబం నిర్వహిస్తున్న సన్ టీవీ నెట్‌వర్క్‌కు ఆమె సొంత సంస్థ రాడాన్ టీవీ ద్వారా కుటుంబ కథ సీరియళ్లను నిరంతరంగా అందిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - అల్లం రసం, తేనె సమపాళ్లలో తీసుకుని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే... |
| |
|
|
|
|
|
|
|