|
| మాధురి దీక్షిత్ జన్మదిన వేడుకల్లో అభిమాని సేవాభావం | |
జంషెడ్‌పూర్‌లో ఓ వీరాభిమాని బాలివుడ్ నటి మాధురి దీక్షిత్ జన్మదిన వేడుకలను సేవాభావంతో కొనియాడాడు. జంషెడ్‌పూర్‌లోని సాక్షి మార్కెట్‌లో ఓ చిన్న తినుబండార కేంద్రాన్ని నిర్వహిస్తున్న పప్పుసింగ్ అలియాస్ పప్పు సర్దార్ గత పదేళ్లుగా మాధురి పుట్టిన రోజున ఏదైనా కార్యక్రమం చేపట్టి ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఆమె నిలువుటెత్తు చిత్రపటం ముందు అర్ధరాత్రి వేళ పువ్వులు, పండ్లు, అగరబత్తీలు ఉంచి, కేక్ కట్ చేసే పప్పు సింగ్ ఈ దఫా మరో ప్రత్యేక రీతిలో ఆ సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని చెషైర్ అనాథ, మానసిక వికలాంగ బాలల హోంలో సోమవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దల్బాం సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆర్కే శర్మ ఈ సంబరాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజంతా వారితో కలసి ఆనందం పంచుకున్న పప్పు వారికి ఈ సందర్భంగా కానుకలు అందించారు. అంతేకాక చెషైర్ హోంలో చేరే వారందరికీ ఈ ఏడాది నుంచి ఎల్‌ఐసీ పాలసీలు కూడా అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - కంప్యూటర్ల ముందు అధిక సమయం కూర్చోవటం వలన కంటి చూపు మందగించే... |
| |
|
|
|
|
|
|
|