|
 | | మేషం | భూమి, గృహావసరాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరి రాక ఉల్లాసం కల్గిస్తుంది. నిర్మాణపు పనులకు అనుకూలం. ఆర్ధికాభివృద్ధి కన్పిస్తుంది. అనుకున్న మొత్తం చేతికందుతుంది. ఖరీదైన వస్తువులు సమకూర్చుకుంటారు. హామీలు నెరవేరుస్తారు. విశ్రాంతి మందిరాలు, ఏకాంత స్ధలాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. విశ్వవిద్యాలయాలు, ఆలయాలు, ఆశ్రమాల సందర్శన ప్రశాంతతను ఇస్తుంది.
|
|
|  | | వృషభం | రాజకీయాలు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అనుకూలం. దూర ప్రాంతాలు, ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి గల వ్యక్తుల సహకారంతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. సంకల్పం నెరవేరుతుంది. పూర్వానుభవంతో కొత్త వ్యూహాలు రూపొందిస్తారు. న్యాయ సలహాలకు, రవాణాకు డబ్బు చెల్లిస్తారు. విద్యా విషయాలు , రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలు, ఆధ్యాత్మిక వ్యవహారాలకు ఖర్చు చేస్తారు.
|
|
|  | | మిథునం | లక్ష్య సాధనలో భాగస్వామి సహకారం అందుతుంది. వివాహాది శుభకార్యాల గురించి చర్చిస్తారు. సిబ్బంది సమావేశంలో కానీ, సదస్సులో కానీ పాల్గొంటారు. వినోద, విలాసాలకు అనుకూలం. కళలు, క్రీడలు, సృజనాత్మక రంగాలలో రాణిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్నారులకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
|
|
|  | | కర్కాటకం | కాంట్రాక్టులు, సరకుల రవాణా, చర్చలకు అనుకూలం. మార్కెటింగ్, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, విద్యకు అవసరమైన వనరులు సమకూర్చుకుంటారు. ఆందోళనలు తగ్గుతాయి. దీర్ఘకాల ఆటంకాలు తొలగిపోయి కొత్త పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది. మౌనంగా మీ లక్ష్య సాధనకు ఉపక్రమిస్తారు.
|
|
|  | | సింహం | సన్నిహితుల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. విహార యాత్రలు చేస్తారు. కంపెనీలు, సహకార సంఘాల కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తాయి. కళా సాంస్కృతిక, ఆరాధన కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ సంబంధాలకు, దూరపు బంధువులు, మిత్రులతో వ్యవహారాలకు అనుకూలం. ప్రముఖులను కలుసుకుంటారు. ఉభయులకు ఆసక్తి గల అంశాలను చర్చిస్తారు. కానుకలు, విరాళాలకు ఖర్చు చేస్తారు.
|
|
|  | | కన్య | సహోద్యోగులతో మైత్రి, అనుబంధాలు బలపడతాయి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో భాగస్వామి సహకారం అందుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఒకరితో అనుబంధం ఏర్పడుతుంది. మీ విద్యార్హత, అనుభవం, నైపుణ్యం లక్ష్య సాధనకు ఉపయోగపడతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు.
|
|
|  | | తుల | గృహావసర రుణాలు, వస్తువుల సేకరణకు అనుకూలం. నిర్మాణ పథకాలు, స్ధిర చరాస్తి విషయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ప్రయాణం లేదా బంధు మిత్రుల కలయిక జరుగుతుంది. గృహ వసతి లభిస్తుంది. స్థిర చరాస్తుల ఒప్పందాలకు తగిన సమయం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఒప్పందం లాభిస్తుంది. ఫీజులు చెల్లిస్తారు. బంధు మిత్రులతో ఇంటి విషయాలు చర్చకు వస్తాయి. ఇంట్లో సందడి నెలకొంటుంది.
|
|
|  | | వృశ్చికం | కాంట్రాక్టులు, సరకుల రవాణా, చర్చలకు అనుకూలం. మార్కెటింగ్, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, విద్యకు అవసరమైన వనరులు సమకూర్చుకుంటారు. ఆందోళనలు తగ్గుతాయి. దీర్ఘకాల ఆటంకాలు తొలగిపోయి కొత్త పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది. మౌనంగా మీ లక్ష్య సాధనకు ఉపక్రమిస్తారు.
|
|
|  | | ధనస్సు | సన్నిహితుల సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. విహార యాత్రలు చేస్తారు. కంపెనీలు, సహకార సంఘాల కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తాయి. కళా సాంస్కృతిక, ఆరాధన కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ సంబంధాలకు, దూరపు బంధువులు, మిత్రులతో వ్యవహారాలకు అనుకూలం.
|
|
|  | | మకరం | ప్రముఖులను కలుసుకుంటారు. జయింటు ఖాతాలు, నిధుల సేకరణకు అనుకూలం. ఉభయులకు ఆసక్తి గల అంశాలను చర్చిస్తారు. కానుకలు, విరాళాలకు ఖర్చు చేస్తారు. సహోద్యోగులతో మైత్రి, అనుబంధాలు బలపడతాయి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో భాగస్వామి సహకారం అందుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.
|
|
|  | | కుంభం | విరామ కేంద్రాలు, ఆశ్రమాలు, ఏకాంత స్థలాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విదేశీ, ఉన్నత చదువుల వ్యవహారాల్లో ఆశాభంగం కలుగుతుంది. విహార యాత్రలు, విందు వినోదాలకు అంచనాలు మించి ఖర్చు చేస్తారు. పెట్టుబడులు, స్పెక్యులేషన్లలో నష్టాలు కలుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
|
|
|  | | మీనం | ఉన్నతాధికారుల వైఖరి రుచించదు. పెద్దల ఆరోగ్యం ఆవేదన కల్గిస్తుంది. మీ ప్రతిష్ఠకు భంగం కలిగే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో షాపింగ్‌కు అనుకూలం. ఆర్ధిక వ్యవహారాలలో సహచరులు, భాగస్వామి సహకారం అవసరం కావచ్చు. బహుమతులు, కానుకలు అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఉల్లాసం కల్గిస్తాయి. సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సరికొత్త పద్ధతులు పాటించడం ద్వారా కృషి రంగంలో రాణిస్తారు.
|
|
|
|
| |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|