యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
వంటగది నిర్మాణంలో వాస్తు సూచనలు
మంగళవారం, 19 మే 2009   ( 15:40 IST )
కొత్తగా గృహన్ని నిర్మించే సమయంలో అందులో అన్ని గదుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చినట్టే వంటగది నిర్మాణానికి మనం ప్రాధాన్యం ఇచ్చే సంగతి తెలిసిందే. వాస్తు సూచనల ప్రకారం కొత్తగా గృహాన్ని నిర్మించినప్పుడు వంటగది తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనేదీ లేదు. అయితే వంటగదిని నిర్మించాలనుకున్నప్పుడు మాత్రం కొన్ని నియమాలు తప్పనిసరి అని వాస్తు చెబుతోంది.

దీనిప్రకారం వంటగది అనేది గృహం ఆవరణలోని అగ్ని స్థానమైన ఆగ్నేయంలో ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ విశాలమైన ఆగ్నేయ ఆవరణ ఉన్నట్టైతే ఉప గృహంలో వంటగది ఏర్పాటుచేసుకోవచ్చని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవేవీలేని పక్షంలో ఆగ్నేయ స్థానంలో చిన్న స్టౌ నైనా పెట్టుకుని వంటచేసుకోవచ్చని వాస్తు చెబుతోంది. మొత్తంమీద ఆగ్నేయ దిశను ప్రధానంగా చేసుకుని గృహంలో వంటగదిని నిర్మించుకుంటే ఆ గృహంలో అష్టైశ్వర్యాలు కొలువుంటాయని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.

ఇక వంటగదిలో గ్యాస్ పొయ్యికోసం తూర్పు గోడకు వేసే ఫ్లాట్‌ఫారం కింద మెట్టు పెట్టకూడదు. దక్షిణ, పశ్చిమ దిశలలో వేసే ఫ్లాట్‌ఫారం కింద మెట్లు పెట్టుకోవచ్చని వాస్తు సూచిస్తోంది. ఫ్లాట్‌ఫారంతో పాటు పెట్టే నీళ్లు సింకు పొయ్యికి వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టడం, వంటగదికి రెండు కిటికీలు పెట్టడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వివాహబంధంలోనూ వెంటవచ్చే వాస్తు
వాస్తు ప్రకారం గృహ నిర్మాణ స్థలం ఎంపిక
ఒకే స్థలంలో జంట గృహాలు... ఫలితాలు
కొత్త నిర్మాణాలను ఎప్పుడు ఆపవచ్చు...?
వాస్తు ప్రకారం గృహంలో ద్వారాల అమరిక
పంచభూతాలకు ప్రాముఖ్యతనిచ్చే వాస్తు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నపూర్ణ స్టూడియోలో "వెంగమాంబ"
మీనా "వెంగమాంబ"గా నటిస్తోన్న చిత్రం తాజా షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది.
బాలకృష్ణ హీరోగా యునైటెడ్ మూవీస్ చిత్రం
వేడుకగా హీరో రామ్ పుట్టిరోజు వేడుకలు
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...