యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
వివాహబంధంలోనూ వెంటవచ్చే వాస్తు
5 మే 2009   ( 15:32 IST )
గృహానికి సంబంధించిన వాస్తు ఆ గృహంలో నివశించేవారికి జరిగే వివాహాల విషయంలోనూ ప్రభావం చూపిస్తుందని తెలిస్తే ఆశ్చర్యం వేయకమానదు. వివాహ బంధంద్వారా ఒకటయ్యే వధూవరులకు సంబంధించి వారు నివశించే గృహ వాస్తును అనుసరించి వివాహం జరిగితే వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

దీని ప్రకారం తూర్పు భాగంలో ప్రధాన ద్వారం అమరి ఉన్న గృహంలో వసించే వరునికి, పడమర భాగంలో ప్రధాన ద్వారం కలిగి ఉన్న వధువుతో వివాహం జరిగినట్లైతే వారి జీవితం సుఖసంతోషాలకు నిలయమవుతుందని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు.

అలాగే దక్షిణంవైపు చూసే స్థలంలో దక్షిణ భాగంలో ప్రధాన ద్వారాన్ని కలిగి ఉన్న గృహంలో నివసించే వరుడికి, పడమర, ఉత్తరం దిశగా ద్వారం కలిగి ఉన్న వధువునిచ్చి వివాహం చేస్తే వారికి అష్టైశ్వర్యాలు అందివస్తాయని వాస్తు చెబుతోంది.

దీంతోపాటు పడమర దిశగా చూసే ప్రధాన ద్వారం కలిగివున్న ఇంటిలో నివశించే వరుడితో, దక్షిణంలేదా తూర్పు దిశగా చూసే స్థలంలో నివసించే వధువుతో వివాహం జరిగినట్లైతే వారి జీవితంలో సుఖసంతోషాలు చోటు చేసుకుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇక పడమర దిశగా చూసే స్థలంలో ఉచ్చస్థానంలో ప్రధాన ద్వారం కలిగిన గృహంలోని వరునికి, తూర్పు, లేదా ఉత్తరం దిశగా గల గృహంలోని వధువుతో వివాహం చేసినట్లైతే ఎటువంటి మనస్పర్దలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారని వాస్తు పేర్కొంటోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వాస్తు ప్రకారం గృహ నిర్మాణ స్థలం ఎంపిక
ఒకే స్థలంలో జంట గృహాలు... ఫలితాలు
కొత్త నిర్మాణాలను ఎప్పుడు ఆపవచ్చు...?
వాస్తు ప్రకారం గృహంలో ద్వారాల అమరిక
పంచభూతాలకు ప్రాముఖ్యతనిచ్చే వాస్తు
వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వెండితెరకు రీఎంట్రీ: ఆర్తీ అగర్వాల్ కొత్త చిత్రం
కొన్నాళ్ల క్రితం వెండితెరకు దూరమైన ఆర్తీ అగర్వాల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది.
త్వరలో ప్రేక్షకుల ముందుకు దమ్మున్నోడు
నారా రోహిత్ హీరోగా అశ్వనీదత్ భారీ చిత్రం!
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...