|
| వాస్తు ప్రకారం గృహ నిర్మాణ స్థలం ఎంపిక |
| మంగళవారం, 28 ఏప్రిల్ 2009 ( 16:53 IST ) | |
గృహాన్ని నిర్మించే సమయంలో అందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయడంలోనే కాస్త జాగ్రత్తలు పాటిస్తే అటుపై ఆ స్థలంలో కట్టే ఇంటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అందుకే గృహ నిర్మాణానికి సంబంధించి స్థలం ఎలా ఉండాలనే విషయానికి సంబంధించి వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది.
భారతీయ వాస్తు ప్రకారం గృహాన్ని నిర్మించేముందు అందుకు తగ్గ స్థలాన్ని ఎలా ఎన్నుకోవాలన్న విషయాన్ని వాస్తుశాస్త్రం చక్కగా వివరించింది. దీని ప్రకారం గృహ నిర్మాణంకోసం ఎంచుకునే స్థలం ఆకారం అర్థచంద్రాకృతి, డ్రాగన్ రూపంలోగాని ఉండటం మంచిదని వాస్తు చెబుతోంది. వాస్తుశాస్త్రాన్ని అనుసరించి స్థలానికి తూర్పుదిక్కున డ్రాగన్, కలప, పచ్చరంగు ఉంటే మంచిదని వాస్తు నిపుణుల సలహా.
ఎందుకంటే పచ్చరంగు వసంత ఋతువును సూచించే కారణంగా తూర్పు దిక్కున పచ్చరంగు కనిపించేలా గార్డెన్ పెంచటం మంచిదని వాస్తుశాస్తం చెబుతోంది. అలాగే పడమర దిక్కున లోహం, తెలుపురంగులు శిశిర ఋతువును సూచించే కారణంగా లోహ సంబంధిత వస్తువులను పడమర మూలలో పెట్టడం మంచిదని వాస్తు సూచిస్తోంది.
దీంతోపాటు నీరు, నలుపు చలికాలాన్ని సూచిస్తాయి కాబట్టి ఉత్తర దిక్కున నీటికి సంబంధించి ఏర్పాటు ఉంటే మంచిది. అగ్ని, ఎరుపురంగు వేసవిని సూచిస్తాయి. కాబట్టి ఎర్రని మట్టితో కూడుకొన్న స్థలంగా దక్షిణ దిక్కు ఉంటే బాగుంటుందని వాస్తు ఉవాచ. ఇక గృహాన్ని నిర్మించే స్థలాన్ని ఎంపిక చేసే సమయంలో సదరు స్థలానికి ఎదురుగా ఉండే రోడ్డు ప్రవాహ వేగం నెమ్మదిగా ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే వంపులు తిరిగిన గాలి విసురుగాలిగా మారుతుందని వాస్తు చెపుతోంది. అదేవిధంగా విసురుగా వీచేగాలుల వలన ఇంటి నిర్మాణానికి, నివసించే వారికి ఇబ్బిందికరాన్ని కలిగిస్తాయి. అందుచేత స్థలాలను ఎన్నుకోవటంలో వాస్తు శాస్త్రాన్ని పాటిస్తే శుభప్రదాలు జరగటం తథ్యమని వాస్తు చెబుతోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|