యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
ఒకే స్థలంలో జంట గృహాలు... ఫలితాలు
మంగళవారం, 21 ఏప్రిల్ 2009   ( 18:16 IST )
ఒకే స్థలంలో రెండు ఇళ్లు నిర్మించినట్టైతే ఆ నిర్మాణాలకు సంబంధించి కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని అననుకూల ఫలితాలు ఉంటుందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.

దీనిప్రకారం ఒకే ప్రదేశంలో దక్షిణ, పశ్చిమ భాగాలలో నిర్మించిన రెండు గృహాలు మంచి ఫలితానిస్తాయి. అలాగే ఈ విధంగా నిర్మించిన ఇళ్లలో నివసించే వారికి ఆదాయం చక్కగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అయితే ఇలా నిర్మించే సమయంలో పశ్చిమ, దక్షిణాలలో కొంచెం ఖాళీ స్థలాన్ని వదలి ఇంటి నిర్మాణం చేపట్టడం మంచిదని వాస్తుశాస్త్రం సూచిస్తోంది.

అలాగే ఒకే స్థలంలో పశ్చిమ, దక్షిణ భాగాలలో గృహాలలో నిర్మించినపుడు పశ్చిమంలోకన్నా, తూర్పువైపున ఎక్కువ స్థలం వదలాలి. దీంతోపాటు దక్షిణంలోకన్నా ఉత్తరభాగంలో ఎక్కువ ఖాళీ స్థలాన్ని తప్పనిసరిగా వదలాలి. దీని వల్ల ఫలితాలు మరింత బాగుంటాయని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.

ఇక ఖాళీ స్థలంలో పశ్చిమ భాగంలో పూర్తిగా ఒక గృహాన్ని, మిగిలిన దక్షిణ భాగంలో ఒక గృహాన్ని నిర్మించవచ్చు. ఈ విధంగా నిర్మించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తు చెబుతోంది. అలాగే ఒకే స్థలంలో పడమర భాగంలో ఒక ఇంటిని తరువాత కొంత ఖాళీ స్థలము వదలి అదే రకపు ఇంటిని మరొకటి నిర్మించవచ్చు. ఇలా నిర్మించినపుడు ముఖ్యంగా పడమర ఖాళీ స్థలంకన్నా తూర్పువైపున ఖాళీ స్థలము ఎక్కువగా వుండాలని వాస్తు సూచిస్తోంది. ఇలా చేయకుంటే ఫలితాలు తారుమారు అవుతాయని వాస్తు పేర్కొంటోంది.

అలాగే ఒకే స్థలంలో పడమర సరిహద్దు గోడను ఆనుకుని ఒక గృహాన్ని నిర్మించి, అదే వైపుగా కొంత ఖాళీస్థలం వదలి మళ్ళీ మరో గృహాన్ని నిర్మించుకోవచ్చు. ఇలా చేసినపుడు కూడా తూర్పున ఖాళీ స్థలం ఎక్కువ వుండాలి. దక్షిణం కన్నా ఉత్తరాన ఖాళీ స్థలం ఎక్కువగా వుండాలని వాస్తు చెబుతోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త నిర్మాణాలను ఎప్పుడు ఆపవచ్చు...?
వాస్తు ప్రకారం గృహంలో ద్వారాల అమరిక
పంచభూతాలకు ప్రాముఖ్యతనిచ్చే వాస్తు
వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు
గృహంపై వీధి పోటు... వాస్తు ప్రభావం
ఇంటిస్థలం ఎంపికలో వాస్తు విశేషాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అర్జున్, రామ్‌ల రామరామ కృష్ణకృష్ణ
యాక్షన్ హీరో అర్జున్, దేవదాస్ ఫేమ్ రామ్ హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర...
అదే నా గ్లామర్ రహస్యం: రవితేజ
టాకీని పూర్తిచేసుకున్న "ఆ ఇంట్లో"
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...