|
| కొత్త నిర్మాణాలను ఎప్పుడు ఆపవచ్చు...? |
| మంగళవారం, 7 ఏప్రిల్ 2009 ( 15:35 IST ) | |
కొత్తగా గృహాన్ని నిర్మించేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల కొన్ని నిర్మాణాలను అసంపూర్ణంగా వదిలేస్తుంటారు. అయితే ఇలా కట్టడాలను అసంపూర్ణంగా వదలాల్సి వచ్చినపుడు వేటిని అలా వదిలేయవచ్చు, వేటిని అసంపూర్ణంగా వదలకూడదు అనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది.
దీనిప్రకారం గృహ నిర్మాణ సమయంలో ఏవైనా ఇబ్బందులు, సమస్యలు వస్తే కొన్ని రకాల నిర్మాణ పనులను మాత్రమే ఆపివేయవచ్చు కానీ మరి కొన్ని నిర్మాణాలను మాత్రం తప్పకుండా పూర్తి చేయాల్సి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి లోపల గదులకు ద్వారాలు, కిటికీలు, కప్ బోర్డులు, షో కేసులు తదితర వాటికి సంబంధించిన చెక్కపనులను నిర్మాణ పరంగా అసంపూర్ణంగా ఆపివేయవచ్చు.
అలాగే ఇంటి నిర్మాణంలో భాగంగా ఇంటి లోపల వేసే మొజాయిక్ ఫ్లోరింగ్‌లను ఆపవచ్చు కానీ ఆర్డినరీ గచ్చువాటాన్ని మాత్రం తప్పకుండా పూర్తి చేయాలి. ఇంటిలోపల టాయ్‌లెట్ కోసం గది నిర్మించినప్పటికీ లోపల పరికరాలు పెట్టకుండా ఆపవచ్చు. దీంతోపాటు పూజ గది కట్టిన తర్వాత దానిలోని అలంకరణకు సంబంధించిన పని అంటే టైల్సు వేయటం వంటి పనులను వాయిదా వేసుకోవచ్చు. అలాగే గదులకు సంబంధించిన ద్వారాలు, కాంపౌండ్ గేట్ల నిర్మాణాన్ని ఆపుకోవచ్చు.
అదేసమయంలో శ్లాబు వాస్తురీత్యా వాటం సరిగా లేనప్పుడు శ్లాబుపై ప్లాస్టరింగ్‌లు, ఫినిషింగ్ల్ తప్పనిసరిగా చేయించాలి. ఇంటిలోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నప్పుడు వాటికి తప్పకుండా తలుపులు ఉండాలి. ఇక గృహ నిర్మాణ సమయంలో మెట్లు కట్టకుండా వాయిదా వేసుకోవచ్చు, కిటకీలకు గుమ్మాలకు రంగులు వేయకుండా కూడా ఆపేయవచ్చు. అయితే మేడ మీద, మెట్ల మీద పిట్ట గోడలు కట్టకుండా ఆపకూడదు. బయట ద్వారాలకు తలుపులు పెట్టకుండానే ఇంటి నిర్మాణం ఆగిపోకుండా జాగ్రత్త పడాలి. ఇక ఇంటికి సంబంధించిన కాంపౌండ్ వాల్‌ను కట్టకుండా ఆపవచ్చు.
ఇక చివరగా గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు. అదే విధంగా గోడలు నిర్మించి పైకప్పు (మోల్డింగ్) వేయకుండా ఆపేస్తే ఆ ఇంటికి శుభప్రదం కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|