యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
పంచభూతాలకు ప్రాముఖ్యతనిచ్చే వాస్తు
బుధవారం, 25 మార్చి 2009   ( 16:21 IST )
వాస్తు ప్రకారం గృహ నిర్మాణాన్ని చేపట్టేవారు ప్రకృతికి సంబంధించిన పంచభూతాలకు సైతం తప్పక ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తుశాస్త్రం పంచభూతాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అదేసమయంలో పంచ భూతాలకు హిందూ శాస్త్రంలో మంచి ప్రాధాన్యత ఉండటం అందరికీ తెలిసిన విషయమే.

పంచ భూతాలుగా మనం పేర్కొనే ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ గృహాన్ని నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సఖల బోగాలతో వర్ధిల్లుతారని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. పంచభూతాలకు అధిదేవతలైనవారి ప్రాముఖ్యాన్నిబట్టి గృహనిర్మాణం జరగడం ముఖ్యమని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇందులో భాగంగా పంచభూతాల అధిపతులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నట్లైతే గ్రహాల అనుగ్రహంతో యజమానులకు శుభ ఫలితాలు లభిస్తాయని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.

ఉదాహరణకు నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి వంటింటిని నిర్మించేటప్పుడు అగ్నిదేవునికి ఇష్టమైన దిక్కును అనుసరించి వంటగదిని అమర్చటం చేస్తే మంచి ఫలితాలను సంభవిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం రీతిగా పరిశీలిస్తే పంచభూతాల ఆధారంగా ప్లేస్‌మెంట్‌ను నిర్మించుకోవాలి. దీనిప్రకారం వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండటం మంచిది.

సూర్యరశ్మి వంటగదిపై నుంచి గృహంలోని అన్నీ ప్రాంతాలకు వ్యాపించటం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మొక్కలు పెంచటంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో కలప మొక్కలను పెంచితే దుష్టశక్తులు ఇంటి దరిచేరవు. అంతేగాక అభివృద్ది సూచనలు కూడా అధికంగా కానవస్తాయి.

భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు మంచి ఫలితాలను అందిస్తాయంటే ...

తూర్పు- గృహంలో శాంతి, ఆరోగ్యం, సంపద చేకూరటం,
పడమర- సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,
ఉత్తరం- వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,
దక్షిణం- అదృష్టం, వినోదం, కీర్తి,
వాయువ్యం- తండ్రికి మంచి అభివృధ్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,
నైఋతి- తల్లికి సౌఖ్యం,వివాహ సఫలం,
ఈశాన్యం- వృత్తి పరమైన అభివృద్ధి,
ఆగ్నేయం-అదృష్టం,

పై విషయాల ఆధారంగా పంచభూతాలకు అనుగుణంగా గృహాన్ని నిర్మించటం జరిగితే జీవితంలో మంచి అభివృద్ధి లభిస్తుందని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు
గృహంపై వీధి పోటు... వాస్తు ప్రభావం
ఇంటిస్థలం ఎంపికలో వాస్తు విశేషాలు
ఇంటి నిర్మాణంలో దిక్కుల ప్రాధాన్యత
గృహ నిర్మాణానికి ఉపయోగకరంకాని స్థలాలు
గృహానికి రంగుల ఎంపికలో వాస్తు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అనుష్కకు ఆటోగ్రాఫ్ తెచ్చిన తంటాలు
సినీ తారలకు ఎవరికైనా హిట్లు వస్తే ఓ పట్టాన మాట వినరని అంటుంటారు.
బార్‌లో ప్రీతి జింగ్యానియా డ్యాన్స్
అర్జున్ హీరోగా జై సాంబశివ ఆడియో
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...