యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
ఇంటిస్థలం ఎంపికలో వాస్తు విశేషాలు
మంగళవారం, 3 మార్చి 2009   ( 14:42 IST )
House
AP
ఇంటి నిర్మాణం కోసం స్థలాన్ని ఎంపికచేసే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు పాటించినట్టైతే అటుపై గృహ నిర్మాణాన్ని వాస్తు ప్రకారం చేపట్టడం సులభమవుతుంది. అందుకే ఇంటి స్థలం ఎంపిక సమయంలోనే సదరు స్థలం వాస్తు ప్రకారం ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలించడం ముఖ్యం.

ఎందుకంటే ఇంటి నిర్మాణాంతరం అందులో వాస్తు ప్రకారం ఏదేని మార్పులు చేయదలిస్తే వాటిని కొంత మార్చుకునే అవకాశముంది. అయితే ఇంటిస్థలం కొన్న తర్వాత అందులో ఎలాంటి మార్పులు చేయలేమనే విషయం తెలిసిందే. అందుకే ఈ విషయంలో ముందు జాగ్రత్త పడటం మంచిదని వాస్తుశాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఇక వాస్తుప్రకారం ఇంటిస్థలం ఎంపికలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెల్సుకుందాం.

గృహ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలానికి దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయవ్యం, తూర్పు ఆగ్నేయదిశ- ఈ నాలుదు దిశల్లో ఎటువైపు కూడా రోడ్డు ఉండరాదు. ఒకవేళ అలా ఉంటే అరిష్టమేనని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. ఇంటినిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలానికి తూర్పు ఈశాన్యం, పశ్చిమవాయవ్యం, దక్షిణాగ్నేయ దిశల్లో వీధులు ఉన్నట్లైతే అది అష్టైశ్వర్యాలకు నిలయమని, ఉత్తర-ఈశాన్యం వీధి చూపు కలిగిన స్థలమైతే భోగభాగ్యాలను ప్రసాదిస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.

అలాగే వీధికి ఎదురుగా గదుల నిర్మాణం ఉన్నట్లైతే అటువంటి స్థలాన్ని ఎంపిక చేయడంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వీధికి ఎదురుగా గదుల నిర్మాణం ఉండాలని అలా కాకుండా ద్వార నిర్మాణం ఉంటే దోషాల ప్రభావం ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా గదుల నిర్మాణం చేసినప్పుడు నాలుగువైపులా ప్రహరీ గోడను నిర్మించడం చేయాలని వారు పేర్కొంటున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇంటి నిర్మాణంలో దిక్కుల ప్రాధాన్యత
గృహ నిర్మాణానికి ఉపయోగకరంకాని స్థలాలు
గృహానికి రంగుల ఎంపికలో వాస్తు
వాస్తు ప్రకారం పార్కింగ్ స్థలం ఎంపిక
ఇంటి కప్పు నిర్మాణంలో వాస్తు నియమాలు
ఎల్ ఆకారంలో ఇంటి నిర్మాణం ప్రభావం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
సగం షూటింగ్ పూర్తి చేసుకున్న అధినేత
జగపతిబాబు హీరోగా వి. సముద్ర దర్శకత్వంలో సదాశివుని రవి (న్యూజెర్సీ) సమర్పణలో...
అదో పీడకలలాంటి అనుభవం: నీతూచంద్ర
శోభన్‌బాబుపై వ్యాఖ్యలు: బాబూమోహన్ విచారం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...