|
| గృహ నిర్మాణానికి ఉపయోగకరంకాని స్థలాలు |
ఒక గృహాన్ని నిర్మించినప్పుడు అందులో నివశించేవారు అన్ని కాలాల్లో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. అందుకే గృహ నిర్మాణం కోసం ఎంపికచేసే స్థలానికి ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇలాంటి నేపథ్యంలో గృహ నిర్మాణం కోసం ఎంపికచేసే స్థలం ఏవిధంగా ఉంటే అది నిర్మాణానికి పనికిరాదన్న విషయం గురించి వాస్తు కొన్ని సూచనలు చేస్తోంది. అలాంటి వాటిలో కొన్ని...
గృహాన్ని నిర్మించతలపెట్టిన స్థలములోని నాలుగు భుజములు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్నా అలాంటి స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు. ఇలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే అశుభాలు కలుగుతాయని వాస్తు చెబుతోంది.అలాగే స్థలం యొక్క పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం కూడా మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలుగుతుందని వాస్తు పేర్కొంటోంది.
దీంతోపాటు చేట ఆకారంలో గల స్థలం కూడా ఇంటి నిర్మాణానికి మంచిది కాదు. ఇలాంటి స్థలంలో గృహాన్ని నిర్మించినపుడు గృహస్తులు ఎంత సంపాదించినా నిలువ ఉండటం అసాధ్యం. ఈ కారణంగా సదరు గృహంలోనివారు క్రమంగా దారిద్ర్యానికి చేరువవుతారు. అలాగే నిరంతరం మానసిక అశాంతికి గురికావటం కూడా జరుగుతుందని వాస్తు శాస్త్రజ్ఞులు అభిప్రాయం.
ఇవికాక డమరకపు ఆకారంలో ఉండే స్థలము కూడా గృహ నిర్మాణానికి మంచిది కాదు. ఇలాంటి ప్రదేశంలో ఇంటి నిర్మాణం చేపడితే సంతానం కలగటంలో సమస్యలు, నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది. అలాగే లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలము కూడా గృహ నిర్మాణానికి ఆమోద యోగ్యం కాదు. ఇలాంటి స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తుందని వాస్తు చెబుతోంది.
పైన చెప్పినవే కాకుండా మరికొన్ని రకాల స్థలాలు కూడా గృహ నిర్మాణానికి అనుకూలం కాదు. గృహాన్ని నిర్మించే స్థలం కుంభాకారంగా ఉంటే అందులో నిర్మించే గృహంలో నివశించేవారికి భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపించటం జరుగుతుంది. అలాగే విసన కర్ర ఆకార స్థలంలో గృహం నిర్మించడం వల్ల ఎంతటి ఆస్తిమంతులైనా ఆర్థికంగా దిగజారిపోయే ప్రమాదముంది. కాబట్టి వాస్తుశాస్త్ర సూచనల ప్రకారం ఈ రకమైన ఆకారంలో ఉన్న స్థలాలను గృహ నిర్మాణం కోసం ఎంపిక చేయకపోవడమే మేలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|