యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
వాస్తు ప్రకారం పార్కింగ్ స్థలం ఎంపిక
బుధవారం, 4 ఫిబ్రవరి 2009   ( 12:37 IST )
మనం నివశించే స్థలానికి లేక గృహానికి వాస్తు నియమాలు వర్తించినట్టే వాహనాలను నిలిపి ఉంచే పార్కింగ్ స్థలానికి కూడా వాస్తు అవసరం అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారంలేని స్థలంలో వాహనాలను నిలిపి ఉంచితే భవిష్యత్‌లో ఆ వాహనాలను వినియోగించే సమయంలో అనవసర సమస్యలు ఏర్పడి వాహనదారులకు మనశ్శాంతి కరువవుతుందని వాస్తు విజ్ఞానుల ఉవాచ.

వీరి సలహా ప్రకారం ఉత్తరం, తూర్పు దిశల్లో ఉండేలాగా వాహనాలను ఎక్కువకాలం నిలిపి ఉంచరాదు. ఇలా చేయడం వల్ల వాహనాల్లో సమస్యలు ఏర్పడి వాటిని ఉపయోగించే వారికి చికాగు కల్గించవచ్చు. పైన చెప్పిన దిశలో వాహనాలను నిలిపి ఉంచడాన్ని వాహనదారులు కొనసాగిస్తే వాహనంలో ఏర్పడే సమస్యలు కూడా కొనసాగుతూనే ఉంటాయి.

ఇలా ప్రారంభమైన కష్టాలు చివరకు ఆ వాహనాన్ని అమ్మే స్థితికి తేవచ్చు. దీనివల్ల వాహనదారునికి ఆర్థిక నష్టంతోపాటు మనశ్శాంతిని కూడా దూరం చేయవచ్చు. దీంతోపాటు తూర్పు, ఉత్తరం ప్రాంతాల్లో ఉండేలాగా కూడా పార్కింగ్ స్థలాలను ఎపిక చేయరాదు. అయితే పాడైన వాహనాలను మాత్రం తూర్పు, దక్షిణం, పశ్చిమ దిశల్లో ఆపి ఉంచవచ్చు.

ఇక వాహనాల పార్కింగ్ స్థలాల ఎంపిక విషయానికొస్తే ఇంటికి ఉత్తరం, పశ్చిమ దిశల్లో పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేయవచ్చు. అలాగే వాహనాలకు ఉపయోగించే ఆయిల్స్, గ్రీస్‌లాంటి పదార్థాలను సైతం తూర్పు, ఉత్తర దిశల్లో ఉంచరాదు. ఇలా వాహనాల పార్కింగుకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాహనాల వినియోగంలో తలెత్తే అనవసర సమస్యలనుంచి దూరంగా ఉండవచ్చని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇంటి కప్పు నిర్మాణంలో వాస్తు నియమాలు
ఎల్ ఆకారంలో ఇంటి నిర్మాణం ప్రభావం
ఇంటి స్థలంలోని మట్టికి కూడా వాస్తు వర్తిస్తుందా?
నైరుతి బ్లాక్‌లో నిర్మాణం: తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటిలో వంటగది ఎక్కడ ఉండాలి?
పశ్చిమ దిశ సింహద్వారం: ఫలితాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రభాస్, కరుణాకరన్ కాంబినేషన్‌లో డార్లింగ్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్‌ దర్శకత్వంలో త్వరలో...
ముఖ్యమంత్రి పాత్రలో జగపతిబాబు
తెలుగులో రీమేక్ అవుతున్న ఆకాశమంత
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...