యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
ఇంటి స్థలంలోని మట్టికి కూడా వాస్తు వర్తిస్తుందా?
మంగళవారం, 13 జనవరి 2009   ( 12:10 IST )
House
AP
ఇంటిని కట్టేటప్పుడు స్థలానికి, కట్టబోయే నిర్మాణానికి వాస్తు చూడడం అందరికీ తెలిసిందే. అయితే ఇంటిని కట్టబోయే ప్రదేశంలోని మట్టికి కూడా వాస్తు వర్తిస్తుందని తెలిస్తే కాస్త ఆశ్చర్యం వేయకమానదు. అయితే ఇంటి స్థలంలో ఉన్న మట్టికి కూడా వాస్తు వర్తిస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది.

దీనిప్రకారం ఇంటిని కట్టబోయే స్థలంలో ఉన్న మట్టి రంగు, స్వభావాన్ని బట్టి శ్రేష్ఠమైన ప్రదేశంలో ఇంటిని నిర్మించినట్టైతే ఆ గృహస్థులకు భోగభాగ్యాలు సమకూరుతాయి. వారి ఆర్థికస్థితి సైతం ఎల్లప్పుడు ఉచ్ఛస్థితిలో ఉంటుంది. ఇలా ఇంటిని కట్టే ప్రదేశంలోని మట్టిని గురించి వాస్తు శాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది.

ఇంటిని నిర్మించే స్థలంలోని మట్టి కొంత నలుపురంగులో ఉన్నట్టయితే ధనప్రాప్తి కల్గుతుంది. వస్తు, స్వర్ణ లాభం చేకూరుతుంది. అలాగే ఇంటిని కట్టే ప్రదేశంలోని మట్టి రంగు లేత పసుపురంగులో ఉన్నట్టైతే ఆ స్థలంలో నిర్మాణం చేపట్టినవారికి సైతం పై లాభాలే కల్గుతాయి. దీంతోపాటు ఈ రకమైన మట్టి ఉన్న ప్రదేశంలో ఇంటిని నిర్మించినవారికి ఏదో ఓ రకమైన లాభం ఒకదాని వెంట ఒకటిగా వచ్చి చేరుతుంది.

ఇదేకాక ఇంటిని నిర్మించే ప్రదేశంలో మట్టి రంగు గులకరాయి రంగులో ఉన్నట్టైతే ఆ స్థలంలో నివశించేవారికి లాభనష్టాలు సమంగా ఉంటాయి. కొన్నిసార్లు సుఖమైన జీవితం కన్పించినా మరోసారి కొద్దిపాటి కష్టాలు తప్పవు. అలాగే ఇంటిని నిర్మించే స్థలంలోని మట్టి రంగు పండినరంగు లేదా కాస్త ఎర్రటిరంగులో ఉన్నట్టైతే అట్టి స్థలంలో నివశించే గృహస్థులకు కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటుంది.

అయితే భరింపరాని కీడు మాత్రం సంభవించే అవకాశం లేదని వాస్తుశాస్త్రం చెబుతోంది. దీన్నిబట్టి గృహ నిర్మాణ సమయంలో ఇంటి స్థలంలోని మట్టి రకాన్ని బట్టి కూడా నిర్ణయం తీసుకోవడం మంచిదని వాస్తు నిపుణుల సలహా.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నైరుతి బ్లాక్‌లో నిర్మాణం: తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటిలో వంటగది ఎక్కడ ఉండాలి?
పశ్చిమ దిశ సింహద్వారం: ఫలితాలు
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కలిసిసొచ్చే కాలం కోసం 41-41 అడుగుల స్థలం
చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టేవారికి జాగ్రత్తలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఫిట్టింగ్ మాస్టర్ మదాల్సా శర్మతో కబుర్లు
అల్లరి నరేశ్ హీరోగా ఇ.వి.వి దర్శకత్వంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న...
గుండెపోటుతో నటుడు రామ్మూర్తి మృతి
భూమ చిత్రానికి ప్రశంసలు: నటి గీతాంజలి
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...