యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
గృహ నిర్మాణ క్రమం గురించి చెప్పే కొబ్బరికాయ
- సంకలనం మునిబాబు
గృహ నిర్మాణం చేపట్టడం అంత సులభమైన కార్యక్రమం కాదని మనందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు. నిర్మాణం సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి, అలాగే కొన్నిసార్లు ఖర్చు విషయంలో అంచనాలు దాటి పోవడం వల్ల డబ్బు పరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.

అందుకే పెద్దవాళ్లు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ఉపయోగిస్తుంటారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన పెళ్లి విషయంలో ఎలాంటి శ్రద్ధ అవసరమో, ఇల్లు కట్టే సమయంలోనూ అలాంటి శ్రద్ధ అవసరమని దాని అర్ధం. అందువల్ల ఇంటి నిర్మాణం ప్రారంభించి ముగించే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

మరి ఇంటి నిర్మాణంలో ఏర్పడే ఇబ్బందులు ప్రారంభంలోనే తెలిస్తే బాగుంటుందని అనిపిస్తోంది కదూ. గృహ నిర్మాణాన్ని ప్రారంబించే సమయంలో కొట్టే కొబ్బరికాయ ద్వారా నిర్మాణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను తెలుసుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతోంది. అదెలాగంటే కొబ్బరికాయ పగిలిన క్రమాన్ని బట్టి ఏర్పడే ఫలితాలను వాస్తుశాస్త్రం వివరిస్తోంది.

గృహనిర్మాణాన్ని ప్రారంభించే సమయంలో కొట్టిన కొబ్బరికాయలోని జుట్టు ఉన్న భాగం పెద్దదిగా ఉండి దాని కింది భాగం బాగా చిన్నదిగా ఉంటే నిర్మాణ సమయంలో ఎలాంటి సమస్య ఎదురుకాదని వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే జుట్టు ఉన్న భాగం కింది భాగం కన్నా మూడురెట్ల అధికంగా ఉంటే నిర్మాణ సమయంలో అప్పులు చేసే బాధ ఉండదని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.

అదేసమయంలో పగిలిన టెంకాయ అడ్డంగా కాక నిలువుగా పగిలినట్టయితే నిర్మాణసమయంలో అనేక ఇబ్బందులు ఏర్పడుతాయని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. అలాగే పగిలిన కొబ్బరికాయ అనేక ముక్కలుగా చెదిరిపోయినట్టయితే ఏదో దుశ్శకునాలు ఏర్పడే అవకాశముందని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఉత్తర దిశ నిద్రతో పీడకలలు
తూర్పు దిశలో నిద్ర జ్ఞానానికి మార్గం
సుఖశాంతులను దరిచేర్చే దక్షిణ దిశ నిద్ర
తూర్పు దిశలో నిద్రిస్తే ధనలక్ష్మి దూరమైనట్టే.....!
నివాసానికి యోగ్యమైన స్థలాల ఎంపికలో జాగ్రత్తలు
పెళ్లి మండపం నిర్మాణంలో వాస్తు అవసరమా.....?
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
ఆకట్టుకోని కామెడీ జాన్‌అప్పారావు 40ప్లస్
కృష్ణభగవాన్ హీరోగా, సిమాన్ర్ హీరోయిన్‌గా దర్శకుడు వెంకట్ కూచిపూడి స్వీయనిర్మాణంలో నిర్మించిన...
పర్వాలేదనిపించే ప్రేమాభిషేకం
శ్రీహరిని కొత్త పంథాలో చూపే భద్రాద్రి
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ సినీరంగంలో సక్సెస్‌పుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష అందానికి, అభినయం...
ఇంకా చదవండి|మరిన్ని...